లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ అగాధంలోకి వెళ్ళిపోనుందా...?
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రళయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే విధించిన లాక్ డౌన్.. పరిస్థితులు చక్కబడకపోవడంతో మే 3వ తేదీ దాకా పొడిగించారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనా వైరస్ ప్రభావం అన్నీ రంగాలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగా పడింది. సినిమా ఇండస్ట్రీ పైన ఈ మహమ్మారి ప్రభావం ఇప్పటికే డైరెక్ట్ గా పడింది. గత కొన్ని వారాలుగా సినిమా థియేటర్లు మూత పడ్డాయి... సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఈ సమ్మర్ సీజన్ లో ఒక్కటంటే ఒక్క సినిమా రిలీజ్ కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర సమస్యలను సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటోందని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా లాక్ డౌన్ మే 3వ తేదీ వరకు పొడిగించడంతో సినీ పరిశ్రమ మీద కరోనా ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు. దేశంలో ప్రస్తుత సిచ్యుయేషన్ చూస్తుంటే సినీ పరిశ్రమ అగాధంలోకి వెళ్లబోతోందని.. దాదాపుగా సినీ రంగం ఒక సంవత్సరం వెనక్కి వెళ్లిపోవాల్సిందేనని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అంతేకాకుండా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించినా ఆ తరువాత కూడా చాలా కఠిన నిబంధనలు ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఆంక్షలు ఎత్తేయడానికి ఆగస్ట్ వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ టైమ్ పట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. ఈ దెబ్బతో చాలా మంది చోటా మోటా ప్రొడక్షన్లు దుకాణం సర్దేస్తాయనే అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. ఎందుకంటే సినిమా రిలీజులు.. షూటింగులు ఆగిపోతే అందరికంటే ఎక్కువగా నష్టపోయేది నిర్మాతలే కదా. ఇక పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ విషయానికొస్తే లాక్ డౌన్ కి ముందు చేసుకున్న డీల్స్ లో ఏదైనా నాన్ థియేట్రికల్ ఏజెన్సీల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఉంటే.. ఆ అగ్రిమెంట్ ఉన్న సినిమాల్ని మాత్రమే నిర్మించడానికి ముందుకు వచ్చి, మిగతా వాటిని లైట్ తీసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు.
ఇప్పటికే అగ్ర నిర్మాణ సంస్థలు ఒక్కొటి దాదాపుగా 3 నుంచి 4 సినిమాల్ని ప్రొడక్షన్ దశలో ఉంచాయి. వీటిలో చాలా సినిమాల్ని లాక్ డౌన్ తరువాత క్యాన్సిల్ చేసే అవకాశం ఉందని.. లేకపోతే పోస్ట్ పోన్ కూడా చేసే వీలుందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇక చిన్న ప్రొడక్షన్ హౌస్ లు దివాల తీసే అవకాశాలు ఎక్కువుగా ఉండటంతో చాలా మంది సినీ కార్మికులు, ఆర్టిస్టులు ఉపాధి కోల్పోయే ఛాన్స్ ఉంది. దీంతో ఒక్కో క్రాఫ్ట్ గా సినిమా ఇండస్ట్రీ మళ్లీ కోలుకోవడానికి ఒక సంవత్సరం పైనే పడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదంతా చూసుకుంటే కరోనా దెబ్బకి సినిమా ఇండస్ట్రీ మొత్తం కుదేలైందని చెప్పవచ్చు. మరి ఈ కరోనా కష్టాల నుండి బయటపడి సినీ ఇండస్ట్రీ పూర్వ వైభవాన్ని ఎప్పుడు చూస్తుందో..!