ప్ర‌భాస్ బ‌ర్త్‌డేకి థ‌మ‌న్ గిఫ్ట్

Update: 2018-10-13 12:54 GMT
యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `సాహో` 2019 మోస్ట్ అవైటెడ్ మూవీగా అత్య ంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుస్తోంది. శంక‌ర్- ఎహ‌సాన్ - లాయ్ త్ర‌యం ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగ‌తి విదిత‌మే. అయితే ప్ర‌భాస్ పుట్టిన‌రోజు కానుక‌గా ఈనెల 23న ఈ మూవీకి సంబంధించిన వేడెక్కించే అప్‌డేట్ ని చిత్ర‌యూనిట్ అందిస్తుంద‌ని అభిమానులు ఎంతో ఉత్క ంఠ గా వేచి చూస్తున్నారు.

డార్లింగ్ అభిమానుల‌కు ఆశించిన‌ట్టే అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ట్రీట్ ఉంటుంద‌ని తెలుస్తోంది. అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భ ంగా ఓ బీజీఎంని రిలీజ్ చేసేందుకు యువి క్రియేష‌న్స్ సంస్థ స‌న్నాహ‌కాల్లో ఉందిట‌. ఆరోజు ఫ‌లానా టైమ్‌కి రిలీజ్ చేస్తామ‌ని మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ టైమ్ ప్ర‌క‌టించ‌లేదు కానీ, మొత్తానికి ప్ర‌భాస్ అభిమానులుకు అదిరిపోయే ట్రీట్ ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఆస‌క్తిక‌రంగా `సాహో`కి సంబంధించిన‌ ఈ బీజీఎంకి థ‌మ‌న్ సంగీతం అందిస్తార‌ని చెబుతున్నారు. థ‌మ‌న్ ఇదివ‌ర‌కూ `సైరా-న‌ర‌సింహారెడ్డి` తొలి ప్రీపోస్ట‌ర్ లుక్‌కి బీజీఎంని అందించారు. మాస్ ప‌ల్స్‌కి త‌గ్గ‌ట్టే ఆర్‌.ఆర్ స్పెష‌లిస్టుగా పేరున్న త‌మ‌న్ సాహోకి ఇచ్చే బీజీఎం అద‌ర‌గొడ‌తాడ‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే దీనికి సంబంధించి చిత్ర‌యూనిట్ అధికారికంగా వివ‌రాల్ని వెల్ల‌డించాల్సి ఉంది. సాహో చిత్రానికి సుజీత్ ద‌ర్శ‌క‌త్వ ం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. శ్ర‌ద్ధా క‌పూర్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది
Tags:    

Similar News