తమన్ కూడా అలాంటి పని చేస్తున్నాడా?

Update: 2018-01-26 23:30 GMT
ప్రస్తుతం జనాలకు ఆరోగ్యం పై శ్రద్ధ బాగానే పెరిగింది. జనాల మారిన అలవాట్లు.. జీవన శైలి కారణంగా శారీరక శ్రమ తగ్గిపోవడంతో.. అధిక బరువు సమస్య అనేక మందిని వెంటాడుతోంది. సామాన్యులు మాత్రమే కాకుండా.. ఈ ప్రాబ్లెమ్ ఎదుర్కొంటున్న వారిలో ప్రముఖులు కూడా ఉంటున్నారు.

సంగీత దర్శకుడు తమన్ కూడా తన శరీర బరువును తగ్గించుకునేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాడు. శంకర్ తెరకెక్కించిన బాయ్స్ మూవీలో నటించిప్పటితో పోల్చితే.. ఇప్పుడు తమన్ వెయిట్ బాగా పెరిగిపోయింది. అందుకే ఆహార నియమాల విషయంలో కఠినంగా ఉంటూ.. బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రొఫెషనల్ షెడ్యూల్స్ కారణంగా.. ఈ ప్రయత్నాలు ఏవీ సక్సెస్ కాలేదు. ఇలాంటి సమయంలో సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఓ సలహా ఇచ్చారట. బరువు తగ్గేందుకు గాను ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా సూచించారట. అప్పటికే గతంలో దీని గురించి ఆలోచన చేసినా.. కొన్ని భయాలతో వెనుకంజ వేశాడట తమన్.

ఇప్పుడు ఎస్పీబీ నుంచి సలహా రావడంతో పాటు.. పలువురు సన్నిహితులు కూడా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాల్సిందిగా చెబుతున్నారట. ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోయినా.. పలువురు నిపుణులైన వైద్యులతో చర్చలు నిర్వహిస్తున్నాడట తమన్.
Tags:    

Similar News