తమన్ బాబూ.. ఏంటా కామెంట్?
ఈ జనరేషన్ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో అత్యంత వేగంగా 50 సినిమాలు పూర్తి చేసిన ఘనత తమన్ కే దక్కుతుంది. సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఏడెనిమిదేళ్లలోనే అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసేశాడు. ఐతే తమన్ రాశి విషయంలో పెట్టే శ్రద్ధ వాసి మీద పెట్టడని విమర్శలున్నాయి. అతడి పాటల్లో కొత్తదనం ఉండదని.. ట్యూన్లు రిపీట్ చేస్తుంటాడని.. క్వాలిటీ మీద దృష్టిపెట్టడని అంటారు. ఐతే ఇలాంటి విమర్శలపై ఇంతకుముందెన్నడూ స్పందించని తమన్.. ‘సరైనోడు’ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మాత్రం రెస్పాండయ్యాడు.
ఒక పాటకు సంబంధించి సంగీత దర్శకుడిది మాత్రమే బాధ్యత కాదని అన్న తమన్.. అవసరానికి తగ్గట్లే తాను ట్యూన్లు ఇస్తానన్నాడు. అంతే కాక.. రెమ్యూనరేషన్ ను బట్టే పాటల క్వాలిటీ కూడా ఉంటుందంటూ ఓ షాకింగ్ కామెంట్ చేశాడు. సంగీత దర్శకులుగా తమకు చాలా ఖర్చులుంటాయని.. మారుతున్న టెక్నాలజీని బట్టి ఎప్పటికప్పుడు కొత్త పరికరాలు కొనుక్కుని అప్ డేట్ కావాల్సి ఉంటుందని.. అలాగే గాయకులకు, మ్యూజీషియన్లకు భారీగా పారితోషకాలు ఇచ్చుకోవాల్సి ఉంటుందని తమన్ చెప్పాడు. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఓ మంచి ట్యూన్ ఇవ్వడానికి రెమ్యూరేషన్ తో ఏం సంబంధం ఉందన్నది ప్రశ్న. ఖరీదైన పరికరం ఉంటే.. మంచి ట్యూన్ వచ్చేస్తుందా.. పేరున్న గాయకుడు పాడినంత మాత్రంగా పాట గొప్పదైపోతుందా..? చాలా మామూలు పరికరాలతోనే.. మామూలు సింగర్లతోనే ఎందరో సంగీత దర్శకులు అద్భుతమైన పాటలివ్వలేదా..? పారితోషకం తక్కువ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్లు మంచి ఆడియోలు చేయట్లేదా..? తమన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదు.