• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమన్ ఈజ్ బ్యాక్..

తమన్ ఈజ్ బ్యాక్..

By - Tupaki Desk
Update: 2017-02-08 05:37 GMT
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. ‘కిక్’ సినిమాతో ఒకేసారి ఎంతో పేరు సంపాదించి.. చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ తర్వాత అతడి జోరు ఎలా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశలో దేవిశ్రీ ప్రసాద్ సైతం అతడి ముందు నిలవలేకపోయాడు. వరుసగా సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తూ మిగతా మ్యూజిక్ డైరెక్టర్లందరూ అతడిని చూసి అసూయ చెందేలా దూసుకెళ్లాడు తమన్. ఐతే గత రెండేళ్లుగా అతడి జోరు తగ్గింది. ఒకప్పట్లా వరుసగా భారీ ప్రాజెక్టులు చేయట్లేదు. దేవిశ్రీ ప్రసాద్ మళ్లీ పుంజుకుని బడా ప్రాజెక్టులన్నీ తనే పట్టేస్తున్నాడు. గత ఏడాది తమన్ చేసిన ఏకైక పెద్ద సినిమా ‘సరైనోడు’ మాత్రమే. మిగతావన్నీ చిన్న.. మీడియం రేంజి సినిమాలే.

ఇలాంటి టైంలో తనేంటో తమన్ రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు ‘విన్నర్’ సినిమానే అవకాశంగా మలుచుకున్నాడు తమన్. ఈ సినిమా పాటల్ని కొన్ని రోజులుగా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ముందు సితార.. అనే పాటను మహేష్ బాబు రిలీజ్ చేశాడు. అది ఇన్ స్టంట్ హిట్టయిపోయింది. తర్వాత పిచ్చోడినైపోయా అంటూ ఇంకో పాటను సమంత లాంచ్ చేసింది. దానికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక లేటెస్టుగా సూయ సూయ అనసూయ.. అంటూ ఒక పాట రిలీజ్ చేశారు. సుమ ఈ పాటతోనే సింగర్ అవతారం ఎత్తింది. ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తంగా తమన్.. ప్రతి పాటతోనూ తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ‘విన్నర్’ ఆడియోకు ఆల్రెడీ సూపర్ టాక్ వచ్చేసింది. ఏదో మొక్కుబడిగా లాగించేయకుండా తమన్ ఈ ఆడియో మీద బాగానే శ్రద్ధ పెట్టినట్లున్నాడు. అందుకే సోషల్ మీడియాలో అందరూ ‘తమన్ ఈజ్ బ్యాక్’ అని అతడికి కితాబిస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Thaman 
  • Winner Movie 

Similar News

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన రామాయ‌ణం-1

2026-11-13 02:45 GMT

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ

2026-11-12 20:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

Copyright @2026

Powered by Blink CMS