ఒక్క రోజులో 3 సినిమాలు అనౌన్స్ చేశాడు
ప్రస్తుత సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల అత్యంత వేగంగా పని చేసేది ఎవరంటే తమనే. స్టార్ హీరో సినిమా అయినా.. చిన్న సినిమా అయినా.. నెల రోజుల్లో ఔట్ పుట్ ఇచ్చేయడం అతడికే చెల్లు. అతడి చేతిలో ఎప్పుడూ రెండు మూడు భారీ సినిమాలుంటాయి. ఐతే ఈ మధ్య ఎందుకో తమన్ కొంచెం స్లో అయ్యాడు. స్పీడు తగ్గించాడు. ‘సరైనోడు’ తర్వాత పెద్ద సినిమాలేవీ అతడి ఖాతాలో పడలేదు. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పట్లాగే జోరు కొనసాగిస్తుంటే.. హిప్ హాప్ తమిళ.. అనిరుధ్ లాంటి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగులోకి వచ్చేస్తుండటంతో ఇక తమన్ పనైపోయినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి టైంలో ఒక్క రోజు వ్యవధిలో తమన్ చేయబోయే మూడు క్రేజీ ప్రాజెక్టుల వివరాలు బయటికి వచ్చాయి.
మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నట్లు వెల్లడించిన రోజే.. నాగార్జున-ఓంకార్ కాంబినేషన్లో తెరకెక్కబోయే ‘రాజుగారి గది-2’కు కూడా తమనే సంగీత దర్శకుడని తెలిసింది. మరోవైపు అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కున్న ‘భాగమతి’కి కూడా తమనే సంగీత దర్శకుడు అని ఆలస్యంగా ప్రకటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ ఎవరన్న సంగతి ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేదు. మొత్తానికి తాను ఇంకా రేసులోనే ఉన్నానని చెప్పడానికే తమన్ ఒకేసారి ఈ మూడు సినిమాలకు తానే సంగీత దర్శకుడినని వెల్లడయ్యేలా చేశాడు. ఈ ఏడాది ‘సరైనోడు’ తర్వాత శ్రీరస్తు శుభమస్తు.. చుట్టాలబ్బాయి.. తిక్క లాంటి సినిమాలకు సంగీతాన్నందించాడు తమన్. ఇందులో ‘శ్రీరస్తు శుభమస్తు’ అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/