• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విమర్శకులకు తమన్...

విమర్శకులకు తమన్ జవాబిది...

By - Tupaki Desk
Update: 2016-04-17 05:47 GMT
తన సంగీతం మీద.. ప్రస్తుత తెలుగు సినిమా పాటల తీరు మీద వస్తున్న విమర్శల మీద స్పందించాడు యంగ్ మ్యూజిక్ గన్ తమన్ శివకుమార్. తెలుగులో పరభాషా గాయకులకే పెద్ద పీట వేస్తుండటం మీద అతను మాట్లాడుతూ.. ‘‘అసలు అచ్చమైన తెలుగు పాటలు రాయడమే తగ్గిపోతోంది. పాటల్లో ఇంగ్లిష్.. హిందీ పదాలు ఎక్కువ వాడుతున్నాం. అలాంటిపుడు హిందీ గాయకులు పాడితే తప్పేముంది? ఒక్కోసారి పాటలో అర్థం పర్థం లేని పదాలు వస్తుంటాయి. దానికి నేనే బాధ్యత వహిస్తా. ఐతే పాట అన్నది ఏ ఒక్కరు తీసుకునే నిర్ణయం మీదో ఆధారపడి ఉండదు. అందరూ కలిసే ఓ పాట ఫైనల్ చేస్తాం. కాబట్టి అందరం బాధ్యత వహించాలి’’ అన్నాడు తమన్. ప్రతి సంగీత దర్శకుడికీ ఓ ప్రత్యేకమైన సౌండింగ్ ఉంటుందని.. అలాగే తనకంటూ ఓ స్టయిల్ ఉందని.. ఆ స్టయిల్ ప్రతి సినిమాలో కనిపిస్తుంది కాబట్టే తన పాటలు ఒకే రకంగా ఉంటాయన్న విమర్శలు వస్తుంటాయని తమన్ చెప్పాడు.

ట్యూన్ కట్టిన తర్వాతే పాట రాయడం వల్లే మంచి పాటలు రాయడం లేదన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం విమర్శలపై తమన్ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుత ట్రెండు ఎలా ఉందో అలా చేయాలి. అంతే కానీ ఎప్పుడో ఏదో జ‌రిగింది అలాగే చేయాలంటే క‌రెక్ట్ కాద‌ని నా అభిప్రాయం. శంక‌రాభ‌ర‌ణం.. స్వాతిముత్యం  త‌ర‌హా సినిమాలు ఇప్పుడు ఎవ‌రూ తీయ‌డం లేదు క‌దా. ఒక‌వేళ తీసినా ఆ తరహా సినిమాల్లో ఐటెం సాంగ్స్ పెట్ట‌లేం క‌దా. శ్రీరామ‌రాజ్యం సినిమాకు త‌గ్గ‌ట్టే మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నాకు బాగా న‌చ్చింది. నేనే ప‌దిసార్లు చూశాను. అలాగే బాలు గారు కూడా మాస్ పాటలు.. డ్యూయెట్లు.. ఐటెం సాంగ్స్.. ఇలా అన్ని ర‌కాల పాట‌లు పాడే ఈ స్ధాయికి వ‌చ్చారు. ఒకప్పుడు క్రికెట్లో టెస్టు మ్యాచులే ఆడేవాళ్లు.. తర్వాత వన్డేలొచ్చాయి.. ఇప్పుడు టీ20లు ఆడుతున్నారు. అలాగే మ్యూజిక్ కూడా కాలానికి తగ్గట్లు మారాలి’’  అని తమన్ అన్నాడు.
Tags:    
  • Thaman 
  • Sarrainodu Movie 
  • Telugu NEws 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS