• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీరయ్యకు వెల్కమ్ చెప్పిన...

వీరయ్యకు వెల్కమ్ చెప్పిన భోళా శంకర్

By - Tupaki Desk
Update: 2023-01-19 13:10 GMT
వాల్తేర్ వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమా షూటింగ్ కి రెడీ అయిపోయాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాని మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ఎప్పుడో ఎనౌన్స్ చేసేశారు. అయితే వాల్తేర్ వీరయ్య సినిమా తర్వాత స్టార్ట్ చేయాలని చిరంజీవి ఈ ప్రాజెక్ట్ ని వెనక్కి నెట్టారు. దీనికి కారణం భోళా శంకర్ మూవీ తమిళ్ హిట్ మూవీ వేదాలం రీమేక్ గా తెరకెక్కుతుంది.

2015లో అజిత్ హీరోగా ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. అయితే ఆ సినిమాలో మెయిన్ ఎలిమెంట్ ని తీసుకొని మెగాస్టార్ ఇమేజ్ కి సరిపోయే విధంగా కథ, కథనంలో మార్పులు చేసి మెహర్ రమేష్ సరికొత్తగా స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. ఈ నేపధ్యంలో చిరంజీవి ఇంప్రెస్ అయ్యి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు.

ఇక ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ని అఫీషియల్ గా హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ షెడ్యుల్ కోసం ప్రత్యేకంగా కలకత్తా కాళీ టెంపుల్ సెట్ వేశారు.

ఇక ఈ సెట్ లో షూటింగ్ ప్రారంభించారు. ఇక ఈ షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నాడు. దానికి సంబందించిన వీడియోని చిత్ర  యూనిట్ రిలీజ్ చేసింది. షూటింగ్ లొకేషన్ లో మెగాస్టార్ కేక్ కట్ చేసి దర్శకుడు మెహర్, నిర్మాత రామ్ ఆచంట, కీర్తి సురేష్ కి తినిపించారు.

ఈ మూవీలో కీర్తి సురేష్ మెగాస్టార్ కి చెల్లెలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మొదటి రోజు చిరంజీవి, కీర్తి కాంబినేషన్ లో సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తుంది.

మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. మరి వాల్తేర్ వీరయ్య సినిమాతో భోళా శంకర్ మూవీపై కూడా మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ఆ హైప్ ని మెహర్ రమేష్ ఏ మేరకు అందుకుంటాడు అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    
  • MegaStarChiranjeevi 
  • BholkaShankar 
  • WaltairVeeraih 
  • MeherRamesh 
  • MythriMovieMakers 
  • KeerthySuresh 
  • MovieNews 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS