కొన్ని సార్లు ఇబ్బందులు తప్పవు : తమన్నా

Update: 2019-04-12 17:30 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌ గా అవకాశాలు దక్కించుకోవడం అనుమానమే, ఆమె హీరోయిన్‌ కెరీర్‌ ఖతం అయ్యిందనుకుంటున్న సమయంలో అనూహ్యంగా పుంజుకుంది. అవకాశాలు లేని సమయంలో చిన్నా చితకా అవకాశాలతో నెట్టుకు వచ్చిన తమన్నాకు తమిళం మరియు తెలుగులో ఇటీవల మంచి ఆఫర్లు వచ్చాయి - సక్సెస్‌ లు కూడా దక్కాయి. టాలీవుడ్‌ లో ఎఫ్‌ 2 చిత్రంతో మరోసారి ఈ అమ్మడు స్టార్‌ డం ను చాటుకుంది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న తమన్నా ఒక విషయంలో హీరోయిన్స్‌ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేసింది.

తమన్నా మాట్లాడుతూ... ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. కమర్షియల్‌ సినిమాల్లో ఒకప్పుడు హీరోయిన్స్‌ కేవలం పాటలకే పరిమితం అయ్యేవారు. కాని ఇప్పుడు వస్తున్న దర్శకులు కథలో హీరోయిన్స్‌ ను పార్ట్‌ చేస్తున్నారు. కమర్షియల్‌ సినిమా చేసేప్పుడు దర్శకులకు కొన్ని కండీషన్స్‌ ఉంటాయి. వాటికి లోబడి హీరోయిన్‌ పాత్రను తీసుకోవాల్సి ఉంటుంది. అలా కొన్ని సార్లు హీరోయిన్స్‌ కు ప్రాముఖ్యత దక్కవచ్చు - కొన్ని సార్లు ప్రాముఖ్యత దక్క పోవచ్చు. అయితే ఇప్పుడు స్టార్‌ హీరోల సినిమాల స్థాయిలో ఉండేలా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు వస్తున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే హీరోయిన్స్‌ కూడా తమ సత్తా చాటుకునే అవకాశం దక్కుతుందని తమన్నా చెప్పుకొచ్చింది. కమర్షియల్‌ చిత్రాల్లో హీరోయిన్స్‌ పాత్ర చేయాలంటే కొన్ని సమస్యలు - ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొని సినిమాలు చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. మొత్తానికి మిల్కీ బ్యూటీ హీరోయిన్‌ గా ముదిరిపోయినట్లుగా ఆమె మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News