మిల్కీ బ్యూటీకి 'ఊపిరి' బంపరాఫర్

Update: 2016-07-29 06:56 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు స్పీడ్ బాగా పెంచేసింది. బాహుబలి రిలీజ్ తర్వాత తమ్మూకి క్రేజ్ బాగానే వచ్చినా అదంతా ఆఫర్లుగా టర్న్ అవలేదు. ఇక మెల్లగా తమన్నా వెలుగులు తగ్గిపోతున్నాయని అనుకుంటున్న టైంలో.. అమ్మడికి మళ్లీ క్రేజ్ పెరిగిపోయింది. క్రేజీ ఆఫర్స్ దక్కించేసుకుంటోంది.

ప్రస్తుతం బాహుబలి 2లో తమన్నా కీలక పాత్ర పోషిస్తున్న  సంగతి తెలిసిందే. దీంతో పాటు అభినేత్రి అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో ప్రభుదేవాకి జంటగా నటించింది. రణ్ వీర్ సింగ్ లీడ్ రోల్ లో దర్శకుడు రోహిత్ శెట్టి తీయనున్న మరుసటి ప్రాజెక్టుకు ఇప్పటికే సైన్ చేసిన తమన్నా.. విశాల్ హీరోగా జగపతి బాబు విలన్ గా తెరకెక్కనున్న కత్తి సాందాయ్ చిత్రంలో కూడా నటించనుంది. వీటిన్నిటితో పాటు ఇప్పుడో క్రేజీ ప్రాజెక్ట్ తమన్నా చెంతకు చేరిందని సమాచారం.

తెలుగు బ్లాక్ బస్టర్ ఊపిరిని హిందీలో రీమేక్ చేసేందుకు కరణ్ జోహార్ సిద్ధమవుతున్నాడు. తెలుగులో తమన్నా పోషించిన రోల్ చూసి బాగా ఇంప్రెస్ అయిపోయిన ఈ దర్శకుడు.. హిందీలో కూడా ఆ రోల్ కి తమన్నానే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాడ. ఈ మేరకు ఇప్పటికే ఆఫర్ అందగా.. త్వరలో అగ్రిమెంట్స్ చేసుకోనుంది తమ్మూ. ఒక్కసారిగా మిల్కీ రేంజ్ మళ్లీ మారిపోయినట్లుంది కదూ.
Tags:    

Similar News