సక్సెస్ జోష్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న స్టార్ హీరో..!
'ఆకాశమే నీ హద్దురా' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నారు. తన కెరీర్ లో 39వ చిత్రాన్ని 'కుత్తట్టిల్ ఓరుదన్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నారు సూర్య. ఇందులో 'కర్ణన్' ఫేమ్ రజిషా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసున్న ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. ప్రతిసారి డిఫరెంట్ స్టోరీలతో విలక్షణమైన పాత్రలతో కొత్తదనం చూపించే సూర్య.. '#Suriya39' కోసం లాయర్ పాత్రలో కనిపించనున్నాడు.
వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో గిరిజన తెగలు మరియు వారి సమస్యలపై పోరాడే పవర్ ఫుల్ అడ్వకేట్ రోల్ లో సూర్య నటిస్తున్నారు. తన కెరీర్ లోనే మొదటిసారి సూర్య నల్లకోటు ధరిస్తున్నారు. అందుకే #Suriya39 సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సూర్యనే స్వయంగా నిర్మిస్తుండటం గమనార్హం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలని వెల్లడించనున్నారు.
ఇదిలాఉండగా సూర్య ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో '#Suriya40' ప్రాజెక్ట్ చేస్తున్నారు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందే ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదే క్రమంలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో 'వాడివసల్' అనే సినిమాలో నటిస్తున్నాడు. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.