అమెజాన్ లో ఆకాశమే నీ హద్దురా .. సూర్య సేఫ్ గేమ్ ఆడాడా!
కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికైతే సినిమాలను థియేటర్లలో విడుదల చేసే అవకాశం లేదు. తమిళనాడులో థియేటర్లు తెరుచుకున్నప్పటికీ కరోనా కారణంగా అటుగా వెళ్లేందుకు కూడా ప్రేక్షకులు జంకుతున్నారు.దీంతో కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ చేస్తే నిర్మాతలకు పెద్దగా లాభాలు రావు. ప్రేక్షకుల కూడా థియేటర్ థ్రిల్‌ను మిస్సవుతారు. కానీ సినిమాలు లేట్‌గా విడుదల చేస్తే ప్రతికూల ఫలితాలు రావచ్చు. దీనికి తోడు ఫైనాషియర్ల నుంచి కూడా నిర్మాతలకు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని నిర్మాణసంస్థలు ఆన్లైన్లోనే సినిమాలను విడుదల చేసి.. నష్టాలను కొంతమేర పూడ్చుకుంటున్నాయి.
కోవిడ్ టైమ్ లో అమెజాన్ ప్రైమ్ దిల్ రాజు - నానిల ‘వి’ చిత్రాన్ని ముఫై కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అప్పటివరకు అమెజాన్ అంత భారీమొత్తం పెట్టింది ఇదే మొదటిసారి అనే టాక్ వచ్చింది. కానీ ప్రస్తుతం సూర్య సొంత నిర్మాణంలో ఆయనే ప్రధానపాత్రలో నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని 42 కోట్లకు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు టాక్. అన్ని భాషలకు కలిపి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ఈ మొత్తానికి కొనుగోలు చేసింది. కాగా ' ఆకాశమే నీ హద్దురా' సినిమాకు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నట్టు సమాచారం. దీంతో అమెజాన్ ప్రైమ్‌కు బాగానే గిట్టుబాటు అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కారణంగా ప్రైమ్‌కు ఎంత మంది కొత్త సభ్యులు యాడ్ అవుతారు, ఎన్ని రెన్యూవల్స్ వుంటాయన్నది కీలకం.
అయితే హిట్ సినిమా లేక జనాలు మొఖమాచినఈ సమయంలో సూర్య మూవీకి హిట్ టాక్ రావడంతో సినిమాను రిపీట్ చూసే వాళ్ళు అధికంగా ఉంటారని దీనివల్ల అమెజాన్లో వీక్షణల సంఖ్య కూడా పెరుగుతుందని చెబుతున్నారు. మళ్లీ ఇంకో మంచి సినిమా దొరికి వరకూ ఇది ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది కాబట్టి.. అమెజాన్ కు ఈ సినిమా ఓ రకంగా మేలు చేసినట్లే. ఆకాశమే నీ హద్దురా సినిమాకి హీరో సూర్య అనే నిర్మాత కాబట్టి ఇది ఆయనకు పైసా వసూల్ నా కాదా అని అంటే పైసా వసూల్ సినిమానే అని చెప్పొచ్చు. ఈ సినిమాలో తానే హీరో కావడం, ప్రచార ఖర్చులు పెద్దగా పెట్టాల్సి రా కపోవడంతో ఈ ప్రాజెక్టు ఆయన సేఫెనని అంటున్నారు. పైగా ఈ చిత్రానికి డిజిటల్, శాటిలైట్, హిందీరీమేక్ హక్కులు మొత్తం కలిసి 65 నుంచి 70 కోట్ల వరకు వచ్చిందని టాక్. సినిమాలో కూడా పెద్ద తారాగణం లేదు కాబట్టి సూర్య రెమ్యునరేషన్ పోనూ కాస్త అయినా మిగిల్చే సినిమా అవుతుందని చెబుతున్నారు.