'అన్నాతే' షూట్ ఎలా చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
సూపర్ స్టార్ రజనీకాంత్ - డైరెక్టర్ సిరుతై శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''అన్నాతే''. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం కంప్లీట్ అయిన ఈ సినిమా షూటింగ్ కోవిడ్ పరిస్థితుల్లో కూడా కొనసాగుతోంది. మహమ్మారి వైరస్ కి భయపడి కుర్ర హీరోలే షూట్ ఆపేసుకుంటే.. వయసు మీద పడిన రజనీ షూటింగ్ లో పాల్గొనడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్ లో రజినీ రిస్క్ చేయడం అవసరమా అని కామెంట్స్ చేసిన వారు కూడా లేకపోలేదు. అయితే అంత ధైర్యంగా చిత్రీకరణలో పాల్గొనడానికి 'అన్నాతే' సెట్స్ లో తీసుకుంటున్న జాగ్రత్తలే అని తెలుస్తోంది.
'అన్నాతే' టీమ్ లో కొందరికి కరోనా సోకడంతో ఆ మధ్య షూటింగ్ ఆపేశారు. రజినీ కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. దీంతో కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఎలాగైనా ముందుగా ప్రకటించినట్లే దీపావళికి రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ తో షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పకడ్బందీగా చిత్రీకరణ చేస్తున్నారు. సెట్ లో ఉండే నటీనటులు టెక్నిషియన్స్ ఇతర సిబ్బంది అందరూ కంపల్సరీగా పీపీఈ కిట్స్ - మాస్కులు ధరించాలి అనే రూల్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సెట్స్ లోకి వచ్చే ప్రతి ఒక్కరికీ బాడీ మొత్తం శానిటైజ్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారట.
ఇక అందరూ రజనీకి 8 అడుగుల దూరంలో ఉంటున్నారట. డైరెక్టర్ మాత్రమే సీన్ వివరించడానికి కాస్త దగ్గరకు వెళ్తున్నారట. అప్పుడు కూడా శివ చాలా కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. షాట్ లో ఎవరెవరు ఉంటారో వాళ్ళు మాత్రమే రజినీ దగ్గరకు వచ్చి.. షాట్ అయిన వెంటనే 8 అడుగులు దూరం వెళ్తున్నారట. ఇలా పూర్తి జాగ్రత్తలతో సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్న 'అన్నాతే' టీమ్.. మరో పది రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేయనున్నారని సమాచారం. ఏదేమైనా సీనియర్ స్టార్ హీరో అయిన రజినీకాంత్ ని పెట్టుకొని.. కరోనా పరిస్థితుల్లో కూడా షూటింగ్ చేస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పవచ్చు. కాగా, 'అన్నాతే' రజినీ కాంత్ కెరీర్ లో వస్తున్న 168వ సినిమా. ఇందులో నయనతార - కీర్తి సురేష్ - మీనా - ఖుష్బు - ప్రకాష్ రాజ్ - జగపతిబాబు తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇమ్మాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.