పూల బికినీతో అగ్గి రాజేసింది!

Update: 2019-05-06 15:22 GMT
స‌న్నీలియోన్ .. గ‌త కొంత‌కాలంగా ఎందుక‌నో పెద్ద తెర‌పై క‌నిపించ‌డం త‌గ్గిపోయింది. అయితే దానికి కార‌ణం లేక‌పోలేదు. కెరీర్ ఒత్తిళ్ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే కంటే ప్రస్తుతం వ్య‌క్తిగ‌త జీవితంపైనే స‌న్నీ ఎక్కువ‌గా దృష్టి సారించింద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రోవైపు భ‌ర్త డేనియ‌ల్ తో క‌లిసి స్టార్ స్ట‌క్ సౌంద‌ర్య ఉత్ప‌త్తుల కంపెనీ కోసం చాలానే శ్ర‌మిస్తోంది. త‌న‌ని తాను నిరంత‌రం సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు చేరువ‌గా ఉండేలా మాత్రం జాగ్ర‌త్త ప‌డుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన ప్ర‌తి సెల‌బ్రేష‌న్స్ ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అంద‌రికీ ట‌చ్ లో ఉంది స‌న్నీ.

రీసెంట్ గానే ఓ భారీ భ‌వంతి పై అంత‌స్తు నుంచి న‌గ‌రాన్ని త‌ధేకంగా ప‌రిశీలిస్తున్న స‌న్నీ ఫోటో ఆక‌ట్టుకుంది. అటుపై కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల్ని ఇన్ స్టాలో షేర్ చేసింది. తాజాగా స‌న్నీలియోన్ అదిరిపోయే ఫ్లోర‌ల్ బికినీలో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇటీవ‌ల ఇంత హాట్ బికినీలో స‌న్నీ క‌నిపించిందేం లేదు. చాలా గ్యాప్ త‌ర్వాత ఇలా స్పైసీ ఫోజుతో ద‌ర్శ‌న‌మిచ్చింది. 

``చాలా గ్యాప్ త‌ర్వాత ఇదిగో ఇలా బికినీతో ఛాన్స్ దొరికింది. జైపూర్ లోని నా ఫేవ‌రెట్ ప్ర‌యివేట్ పూల్ లో స్విమ్ చేసే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. జార్జియ‌స్ రిసార్ట్`` అంటూ వ్యాఖ్య‌ను ఆ ఫోటోకి జోడించింది. మొత్తానికి స‌న్నీ బికినీలో స్విమ్ చేసేందుకు ప‌క్కాగా ప్లాన్ చేసుకుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ఆ పూల బికినీలో స‌న్నీ అంద‌చందాలు అంతే హైలైట్ అయ్యాయి. బికినీలో త‌న‌ని తాను సెల్ఫీ తీసుకుంటూ ముఖాన్ని క‌వ‌ర్ చేసేసింది. ఎదురుగా నిలుచుని త‌న ఫోటోని ఎవ‌రు తీసారో కానీ .. బికినీని హైలైట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంది. అన్న‌ట్టు స‌న్నీ న‌టిస్తున్న వీర‌మాదేవి సినిమా ఉన్న‌ట్టా.. లేన‌ట్టా? అంటే దానికి సంబంధించిన అప్ డేట్ లేనేలేదు. క‌నీసం స‌న్నీ అయినా దాని గురించి మాటెత్తిందే లేదేమిటో!
   

Tags:    

Similar News