సుమంత్ డోనారి రెడీ అయిపోయాడట

Update: 2016-08-26 22:30 GMT
అక్కినేని వంశం నుంచి వచ్చిన హీరో సుమంత్.. చాలా కాలంగా ఫామ్ లో లేడనే సంగతి తెలిసిందే. అలాగని వరుసగా తెగ సినిమాలు చేసేసి.. హిట్టు హీరో అనిపించేసుకుందామనే తాపత్రయం కూడా ఈ అక్కినేని వారసుడిలో కనిపించదు. వచ్చినవాటిలో నచ్చిన స్క్రిప్టులను అప్పుడప్పుడూ చేస్తున్నాడంతే. ఇప్పుడు తనే చొరవ చూపి మరీ చేసిన చిత్రం 'నారి నారి డోనారి' ఫినిష్ అయిపోయిందంటున్నాడు సుమంత్.

షూటింగ్ పార్ట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయని చెప్పాడు సుమంత్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'విక్కీ డోనర్' ను తెలుగులో రీమేక్ చేస్తుండగా.. ఇందులో సుమంత్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. మరాఠీ టీవీ కం మూవీ యాక్టర్ పల్లవి సుభాష్ 'నారి నారి డోనారి'లో ప్రధాన పాత్ర పోషిస్తూ.. టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఇప్పుడు సెన్సార్ మినహా మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తయిపోవడంతో.. ప్రమోషన్ వర్క్స్ స్టార్ట్ చేసేస్తానంటున్నాడు సుమంత్.

స్పెర్మ్ డోనర్ గా సుమంత్ నటిస్తున్న ఈ మూవీ ద్వారా మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన 'నారి నారి డోనారి' అక్టోబర్ లో రిలీజ్ చేసేలా సుమంత్ ప్లాన్ చేసుకున్నాడు.
Tags:    

Similar News