కన్ఫామ్‌: దేవిశ్రీప్రసాద్‌.. హీరో అయిపోయాడు

Update: 2015-11-27 12:39 GMT
ఎప్పటినుండో సినిమా హీరో అయిపోవాలనే కలలు కంటున్నాడు దేవిశ్రీప్రసాద్‌. తమిళనాట సంగీత దర్శకుడు జివి ప్రకాష్‌ కుమార్‌ ఎలాగైతే ఒక హీరో అలరిస్తున్నాడో.. మనోడు కూడా అలాగే అలరించాలని ఎప్పటినుండో కలలు కంటున్నాడు. కాని అవి ఎవ్వరూ తీర్చట్లేదు. అందుకే దేవి ఈ మధ్యన మాట్లాడుతూ కథ దొరకట్లేదు బాబయ్యా అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అన్నీ సెట్‌ అయిపోయాయ్‌.

అవును.. సుకుమార్‌ చెప్పిన ఒక కథ.. దేవిశ్రీ ప్రసాద్‌ కు విపరీతంగా నచ్చేసిందట. అందుకే మనోడు ఫ్లాటైపోయి వెంటనే సినిమాను స్టార్ట్‌ చేసేద్దాం అనేంత కసిగా ఉన్నాడు. అయితే ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తోంది నిర్మాత దిల్‌ రాజు గారట. స్వయంగా ఈ విషయాన్ని లీక్‌ చేసింది ఆయనే. కుమారి 21 ఎఫ్‌ ప్రెస్ మీట్‌ లో మాట్లాడుతూ.. నాన్నకు ప్రేమతో సినిమా పూర్తయిన వెంటనే.. సుకుమార్‌ డైరక్షన్‌ లో దేవిశ్రీప్రసాద్‌ హీరోగా సినిమాను మొదలెట్టేస్తున్నాం అంటూ సెలవిచ్చేశాడు. అది సంగతి.
Tags:    

Similar News