టాప్ స్టోరి: టాలీవుడ్ హీరోల చేతులు మారిన‌ క‌థ‌లు

Update: 2021-04-01 03:30 GMT
టాలీవుడ్ లో క‌థ‌లు అటూ ఇటూ మారుతుంటాయి. ఒక హీరో వ‌దులుకున్న క‌థ‌ ఇంకొక హీరో వ‌ద్ద‌కు కూడా వెళుతుంటుంది. అలా క‌థ చేతులు మారాక కొంద‌రు దాంతో బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టి కెరీర్ ప‌రంగా ఖుషీ అయిన‌వాళ్లు ఉన్నారు. డిజాస్ట‌ర్ల‌తో నిరాశ చెందిన వారు ఉన్నారు. అలాంటి వారి జాబితాని తిర‌గేస్తే చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలే తెలిసాయి.

టాలీవుడ్ అగ్ర హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌దిలేసిన‌వి ప‌రిశీలిస్తే.. అమ్మా నాన్న ఓ త‌మిళ అమ్మాయి .. పోకిరి (మ‌హేష్) సంచ‌ల‌న విజ‌యాలు సాధించాయి. ఒక‌దానిలో ర‌వితేజ న‌టిస్తే మ‌రొక సినిమాలో మ‌హేష్ న‌టించి సంచ‌ల‌న విజ‌యాలు అందుకున్నారు. ఆ ఇద్ద‌రి కెరీర్ ని మార్చి ద‌శ దిశ తిప్పేసిన సినిమాలివి. గోపిచంద్ న‌టించిన గోలీమార్ .. మ‌హేష్ - వెంకీ న‌టించిన సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రాల్లో  న‌టించాల్సిందిగా ద‌ర్శ‌కులు ప‌వ‌న్ కి క‌థ‌లు వినిపించారు. కానీ ఆయ‌న రిజెక్ట్ చేశారు. ర‌వితేజ మిర‌ప‌కాయ్ లోనూ ప‌వ‌న్ న‌టించాల్సింది. కానీ చేయ‌లేదు. సింగీతం తెర‌కెక్కించాల‌నుకున్న జీస‌స్ క్రిస్ట్ ని ప‌వ‌న్ తిర‌స్క‌రించాక అది వేరొకరి వ‌ద్ద‌కు వెళ్ల‌లేదు. పూర్తిగా ఆగిపోయింది.

మ‌హేష్ వ‌దిలేసిన‌వి ప‌రిశీలిస్తే.. ప్ర‌భాస్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ వ‌ర్షం ఆఫ‌ర్ తొలుత మ‌హేష్ వ‌ద్దకే వ‌చ్చింది. కానీ వ‌దులుకున్నారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఇడియ‌ట్ ఆఫ‌ర్ తొలుత మ‌హేష్ వ‌ద్ద‌కే వెళ్లింది. కానీ ఆయ‌న రిజెక్ట్ చేశారు.  బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు మ‌న‌సంతా నువ్వే -ఏమాయ చేశావే క‌థ‌ల్ని మ‌హేష్ కే తొలుత వినిపించారు. కానీ ఆయ‌న వ‌దులుకున్నారు. మ‌న‌సంతా న‌వ్వేలో ఉద‌య్ కిర‌ణ్ -రీమా సేన్ జంట‌గా న‌టించగా.. ఏమాయ చేశావేలో నాగ‌చైత‌న్య‌- స‌మంత జంట‌గా న‌టించారు. కానీ ఈ సినిమాలు మ‌హేష్ కంటే కొత్త కుర్రాళ్ల‌యిన వీళ్ల‌కే క‌రెక్ట్ అన్న విశ్లేష‌ణ సాగింది.

సుమంత్ - దేశ‌ముదురు చిత్రాన్ని వ‌దులుకోగా.. అందులో అల్లు అర్జున్ న‌టించారు. పూరి తెర‌కెక్కించిన ఆ సినిమా బ‌న్ని కెరీర్ నే మార్చేసింది. ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌దులుకున్న సినిమాల జాబితా చూస్తే.. కృష్ణార్జున యుద్ధం.. ఎటో వెళ్లిపోయింది మనసు.. ఓకే బంగారం.. నేల టిక్కెట్టు చిత్రాలు ఉన్నాయి. ఇవ‌న్నీ ప‌క్కా డిజాస్ట‌ర్లు. చ‌ర‌ణ్ నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని అంగీక‌రించి తీరాలి. గౌత‌మ్ మీన‌న్ తీసిన ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు వ‌దులుకోవ‌డానికి కార‌ణం ఆరెంజ్ ఫ్లాప‌వ్వ‌డ‌మే. కానీ ఆ సినిమాలో నాని న‌టించి ఫ్లాప్ అందుకున్నారు.

మ‌హేష్ న‌టించిన హిట్ చిత్రం బిజినెస్ మేన్ లో సూర్య న‌టించాల్సింది. కానీ ఆయ‌న ఏళాయుం ఆరివు (సెవెంత్ సెన్స్) కోసం ఈ ఆఫ‌ర్ ని వ‌దులుకున్నారు. ఆర్జీవీ-పూరి కాంపౌండ్ సూర్య‌ను లాక్ చేయాల‌ని చూసినా కుద‌ర‌లేదు. ఆ త‌ర్వాత మ‌హేష్ కి ఆ ఆఫ‌ర్ ద‌క్కింది. బిజినెస్ మేన్ 2012 లో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

బ‌న్ని నటించిన 2004 సూపర్ హిట్ చిత్రం ఆర్య అవ‌కాశం మొదట  జూనియర్ ఎన్టీఆర్ కి వ‌చ్చింది. కానీ కాల్షీట్ల స‌మ‌స్య వ‌ల్ల ఎన్టీఆర్ వ‌దులుకున్నారు. బ‌న్ని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్ర‌మ‌ది. పండ‌గ చేస్కో చిత్రాన్ని బ‌న్ని రిజెక్ట్ చేశారు. ఇలా చూస్తే ఈ జాబితా చాలా పెద్ద‌దే ఉంది.
Tags:    

Similar News