రిలీజ్ ముందే స్టార్ హీరో సీక్వెల్ ప్లాన్..?
ఈ మధ్యకాలంలో సినిమాలు హిట్ అయితే చాలు అవి వేరే భాషలో రీమేక్ అవ్వడం మొదలవుతుంది. అలాగే సినిమా ఫలితం బట్టి మేకర్స్ యాక్టర్స్ సినిమా సీక్వెల్ గురించి ప్రస్తావన తీసుకొస్తారు. కానీ సినిమా రిలీజ్ కాకముందే హీరో పర్సనల్ గా సినిమాకు కనెక్ట్ అయిపోయి సీక్వెల్ చేయాలనీ ఉంది అని చెప్పడం మాత్రం అరుదుగా జరుగుతుంది. తాజాగా విడుదలకు దగ్గరపడిన ఓ సినిమా విషయంలో హీరో అలాగే చెప్పేసాడట. అతనెవరో కాదు తమిళ హీరో ధనుష్. ధనుష్ నటించిన కొత్త సినిమా ‘జగమే తంతిరమ్’. ఈ సినిమా తెలుగులో ‘జగమే తంత్రం’ అనే పేరుతో విడుదల చేయనున్నారు.
టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది. గతేడాది వేసవి నుండి సినిమా రిలీజ్ గురించి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అప్పటినుండి మోషన్ పోస్టర్ - రిలీజ్ పోస్టర్స్ అంటూ ప్రమోషన్ చేసారు. ఈ సినిమాలో ధనుష్ డాన్ గా కనిపించనున్నాడు. అలాగే సంప్రదాయబద్ద.ా చొక్కా, పంచెతో కనిపించినా.. చేతిలో గన్నులతో కాస్త మాస్ గానే ఉన్నాడు. అలాగే ఈ క్రైమ్ డ్రామా నుండి ఒక్కో పోస్టర్ విడుదల చేస్తూ బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
హీరో ధనుష్‌కు ఇది 40వ సినిమా కావడం విశేషం. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా గతేడాదిలోనే వేసవి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ అవుతుండగా.. జగమే తంత్రం మూవీ జూన్ 18న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతుంది. అంటే మొత్తానికి సినిమాను ఓటిటి రిలీజ్ చేసేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.. ఏంటంటే.. హీరో ధనుష్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయాడట. అందుకే తాజాగా జగమే తంత్రం సీక్వెల్ చేయాలనీ ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడట. అలాగే డైరెక్టర్ కార్తీక్ స్క్రిప్ట్ రెడీ చేస్తే చేస్తానని అన్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ధనుష్ సీక్వెల్ అభిప్రాయం పై డైరెక్టర్ కార్తీక్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. చూడాలి మరి ప్రస్తుతం అయితే ఇద్దరూ పలు సినిమాలతో బిజీ అయిపోయారు. చూడాలి మరి సీక్వెల్ నిజంగానే వస్తుందా లేదా అనేది