ఢీ 2 తో మళ్లీ ఆ రోజులు రానున్నాయా?

Update: 2020-04-14 05:30 GMT
‘దూకుడు’ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత దర్శకుడు శ్రీనువైట్ల వరుసగా ఫ్లాప్స్‌ చవిచూస్తూ వచ్చాడు. ఢీ నుండి దూకుడు వరకు కూడా శ్రీనువైట్ల రచయితలు కోన వెంకట్‌ ఇంకా గోపీ మోహన్‌ లతో కలిసి వర్క్‌ చేశాడు. ఆ ఆ తర్వాత వారితో విభేదాల కారణంగా సొంతంగా ఒక టీంను ఏర్పర్చుకుని కథలు రాసుకున్నాడు. అయితే ఆయన రాసుకున్న కథలు నిరాశ పర్చాయి. శ్రీనువైట్ల ఇంకా కోన వెంకట్‌ ల మద్య వివాదం ఒకానొక సమయంలో పీక్స్‌ కు వెళ్లింది. అయితే మెగా వర్గాల వారు ‘బ్రూస్‌ లీ’ సినిమా కోసం వీరిద్దరికి కలిపే ప్రయత్నం చేశారు.

ఆ సినిమా కోసం కలిసినట్లుగా అనిపించినా కూడా వారిద్దరు ఎడమొహం పెడమొహంగానే ఆ సినిమాకు పని చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆ సినిమా ఫలితం కూడా తారుమారు అయ్యింది. శ్రీనువైట్లకు ఈ సమయంలో సక్సెస్‌ చాలా అవసరం. ఇలాంటి సమయంలో మళ్లీ కోన వెంకట్‌ గోపీ మోహన్‌ లతో కలవడం మంచిదనే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కోన వెంకట్‌ మాట్లాడుతూ శ్రీను వైట్లతో వర్క్‌ చేయడానికి తనకు ఏమీ ఇబ్బంది లేదన్నాడు. ఆయనతో వర్క్‌ చేసే విషయంలో అభ్యంతరం లేదన్నట్లుగా మాట్లాడటంతో మళ్లీ వీరిద్దరు కలిసి వర్క్‌ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

శ్రీనువైట్ల.. కోన వెంకట్‌.. గోపీ మోహన్‌ లకు ఢీ చిత్రంతో మొదటి బ్లాక్‌ బస్టర్‌ దక్కింది. అందుకే ఇప్పుడు వీరు ఆ సినిమా సీక్వెల్‌ తోనే మళ్లీ కలవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఢీ సినిమా విడుదల 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా సోషల్‌ మీడియాలో వీరి కాంబో గురించి మళ్లీ చర్చ మొదలయ్యింది. శ్రీనువైట్ల ఈగోలను పక్కన పెట్టి ఆ రచయితలతో వర్క్‌ చేయాలని అప్పుడే మునుపటి రోజులు వస్తాయంటూ సన్నిహితులు స్నేహితులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.

శ్రీనువైట్ల కూడా వారితో కలిసి వర్క్‌ చేసే విషయమై ఆసక్తిగా ఉన్నాడట. ఢీ 2 చిత్రంను స్టార్‌ హీరోతో చేసేందుకు శ్రీనువైట్ల ప్రయత్నాలు చేస్తున్నాడని.. స్క్రిప్ట్‌ పూర్తి అయిన తర్వాత ఆ హీరోను సంప్రదించే యోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ఈ ముగ్గురు కలిస్తే ఆ హీరో కూడా తప్పకుండా ఒప్పుకుంటాడనే టాక్‌ కూడా వినిపిస్తుంది.
Tags:    

Similar News