కష్టపడుతున్న శ్రీమంతుడు

Update: 2015-08-28 08:25 GMT
‘శ్రీమంతుడు’ బాక్సాఫీస్ ప్రయాణం కొంచెం కష్టంగానే సాగుతోంది. అలాగని ప్రయాణం మాత్రం ఆగట్లేదు. మూడు వారాల తర్వాత కూడా చెప్పుకోదగ్గ థియేటర్లలోనే సినిమా ఆడుతోంది. ఈ శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేకపోవడంతో ఇంకో వారం రోజులు శ్రీమంతుడి బండి నడిచిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 20 రోజులకు శ్రీమంతుడు షేర్ రూ.77 కోట్లకు చేరింది. అత్తారింటికి దారేది రికార్డు ఇప్పటికే బద్దలైపోయింది. వంద కోట్ల క్లబ్ గురించి ఆలోచించడం అత్యాశే. వచ్చేవారం రెండు క్రేజ్ ఉన్న సినిమాలు వస్తున్నాయి కాబట్టి శ్రీమంతుడు మహా అయితే రూ.85 కోట్ల దాకా వెళ్తాడేమో. ఆ మార్కు సాధించినా అది కూడా గొప్ప విషయమే అవుతుంది.

20 రోజులకు మొత్తంగా అన్ని ఏరియాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వచ్చేయడం విశేషమే. నైజాం ఏరియా వరకు డిస్ట్రిబ్యూటర్ ఇప్పటికే రూ.5 కోట్ల లాభంలో ఉండటం విశేషం. రూ.14.5 కోట్లకు రైట్స్ తీసుకోగా.. ఇప్పటికే రూ.19.6 కోట్ల దాకా షేర్ వచ్చింది. రాయలసీమలో తప్ప మిగతా అన్ని ఏరియాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలు మూటగట్టుకున్నారు. నాలుగో వారం మీద ఆశలతో కొరటాల అండ్ కో రెండు అదనపు  సన్నివేశాల్ని జోడించారు. ఈ రోజు సాయంత్రం ఫస్ట్ షోల నుంచి ఈ రెండు సన్నివేశాలు యాడ్ అవతున్నాయి. ఐతే ఈ అడిషన్స్ ఏవైనా చేయాలనుకున్నపుడు ఇంకా ముందే చేయాల్సింది. మరీ మూడు వారాల తర్వాత అంటే బాగా ఆలస్యమైనట్లే.
Tags:    

Similar News