• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ నటుడు భార్య మీద నిఘా...

ఆ నటుడు భార్య మీద నిఘా పెట్టించాడా?

By - Tupaki Desk
Update: 2018-03-11 06:27 GMT
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. తన భార్య అంజలి మీద అనుమానంతో ఓ డిటెక్టివ్‌ ను నియమించి ఆమె కాల్ డేటాను రహస్యంగా సేకరించినట్లుగా నవాజుద్దీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తమ వ్యక్తిగత కాల్స్ ను ట్రాప్ చేస్తున్నారంటూ కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో థానె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఈ వ్యవహారం చిన్నది కాదని తేల్చిన పోలీులు.. ‘కాల్ డేటా స్కామ్’ పేరుతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. మొత్తం 11 మందిని అరెస్టు చేయగా.. అందులో ఇద్దరు ప్రైవేటు డిటెక్టివ్‌ లు కూడా ఉన్నట్లు తేలింది.

అందులో ఒక డిటెక్టివ్ ను విచారించగా.. నటుడు నవాజుద్దీన్ తన భార్య మీద అనుమానంతో తనతో నిఘా పెట్టించాడని.. ఆమె కాల్ డేటాను సేకరించి ఇవ్వాలని తనకు పని ఇచ్చాడని.. ఇందుకోసం తనకు రూ.50 వేలు చెల్లించాడని ఆ డిటెక్టివ్ పోలీసులకు చెప్పినట్లుగా వెల్లడైంది. దీంతో విచారణకు రావాల్సిందిగా నవాజ్ కు పోలీసులు సమన్లు జారీ చేసినట్లుగా ముంబయి మీడియా వెల్లడించింది. ఐతే ఈ ఆరోపణల్ని నవాజుద్దీన్ ఖండించాడు. మీడియా వాళ్లు తనను సంప్రదించినపుడు తన కూతురి స్కూల్ ప్రాజెక్టు పనిలో బిజీగా ఉన్నానని.. ఈ లోపు తన గురించి అసత్య ప్రచారం మొదలుపెట్టేశారని అన్నాడు. మరి నవాజ్ పై వస్తున్న ఆరోపణల్లో నిజమెంతో చూడాలి.
Tags:    
  • Spying On Wife Allegations 
  • Nawazuddin Siddiqui 

Similar News

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS