‘7/G బృందావ‌న కాల‌నీ’ సోనియా ఇప్పుడెలా ఉందో చూశారా?

Update: 2021-05-19 23:30 GMT
2000 సంవ‌త్స‌రం నాటికి యూత్ గా ఉన్న‌వారి ఇష్ట‌మైన ల‌వ్ స్టోరీ మూవీస్ లిస్టు తీస్తే.. అందులో త‌ప్ప‌కుండా క‌నిపించే పేరు ‘7/G బృందావ‌న కాల‌నీ’.  అంత‌లా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందీ మూవీ. ద‌శాబ్దాలు దాటుతున్నా.. ఇప్ప‌టికీ ఆ చిత్రాన్ని మ‌రిచిపోలేరంటే అతిశ‌యోక్తి కాదు. స‌గ‌టు ప్రేమికుడు త‌న‌ను తాను తెర‌పై చూసుకున్న సినిమా అది.

సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ్ లో తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ భారీ విజ‌యం సాధించింది. పాట‌లు కూడా యూత్ ను ఊపేశాయి. అందులో హీరోయిన్ గా న‌టించింది సోనియా అగ‌ర్వాల్‌. ఈ చిత్ర విజ‌యంతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారిపోయింది సోనియా. అయితే.. ఆ స్టార్ డ‌మ్ ను నిలుపుకోలేక‌పోయింది. ఆ త‌ర్వాత పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. వ‌చ్చిన కొన్ని ఛాన్సులు కూడా త‌న కెరీర్ కు హెల్ప్ కాలేదు.

త‌మిళంలో కొన్ని చిత్రాలు చేసిన సోనియా అగ‌ర్వాల్‌.. ఆ త‌ర్వాత తెర‌మ‌రుగైంది. అప్పుడ‌ప్పుడూ ప‌లు టీవీ షోల‌లో క‌నిపించిన సోనియా.. ఈ మ‌ధ్య‌ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మ‌ల్లీ వెండితెర‌పై క‌నిపిస్తోంది. కాగా.. ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకుంద‌నే రూమ‌ర్స్ కూడా వినిపించాయి. ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన ఫొటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. అయితే.. లేటెస్ట్ గా వ‌చ్చిన ఫొటోలు చూసి నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు. ఈ బ్యూటీలో అప్ప‌టికీ.. ఇప్ప‌టికీ ఎంత తేడా వ‌చ్చిందీ? అంటూ కామెంట్ చేస్తున్నారు.
Tags:    

Similar News