మహేష్ కి ఆ సీక్రెట్ చెప్పేసింది

Update: 2017-06-23 04:39 GMT
బుడతల కబుర్లు భలేగుంటాయి. తాము చెప్పదలుచుకున్న విషయాన్ని గుసగుసలాడుతూ చెవిలో చెప్పి తెగ ఆనందించేస్తూ ఉంటారు. అది పెద్ద సీక్రెట్ ఏమీ కాకపోయినా.. ఇలా చెవిలో చెప్పడం వారికి తెగ ఇష్టమైతే.. చిన్నారుల నోటి వెంట చిన్ని చిన్ని సీక్రెట్స్ వినడం పెద్దలకు కూడా ఆనందమే. అదే.. ఆ కబుర్లు చెప్పేది కన్నబిడ్డలే అయితే ఆ హ్యాపీనెస్ మరిన్ని రెట్లు పెరిగిపోతుంది.

సినిమాలను ఎంతో ప్రొఫెషనల్ గా తీసుకునే మహేష్ బాబు.. ఫ్యామిలీ విషయంలో కూడా అంతకు మించి జాగ్రత్తలు పాటిస్తాడు. ఖాళీ దొరికితే కుటుంబంతో గడపడం కాకుండా.. కుదుర్చుకుని మరీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటాడు. రీసెంట్ గా సమ్మర్ కి సూపర్ స్టార్ అండ్ ఫ్యామిలీ లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కొన్ని వారాల పాటు భార్య నమ్రత.. కొడుకు గౌతమ్.. కూతురు సితారలతో స్పెండ్ చేశాడు మహేష్. ఆ సమయంలో నమ్రత క్లిక్ మనిపించిన ఫోటోనే ఇది.

నాన్న చెవిలో గుసగుసలాడుతూ సీక్రెట్ చెప్పేస్తున్న సితార భలే క్యూట్ గా కనిపిస్తోంది. ఏం గుట్టు విప్పేస్తోందో కానీ.. మహేష్ కూడా భలే ముసిముసిగా నవ్వేసుకుంటున్నాడు. అదే సోఫాపై దగ్గరలో కూర్చున్న సూపర్ స్టార్ వారసుడు గౌతమ్.. స్మార్ట్ ఫోన్ తో టైం స్పెండ్ చేస్తున్నాడు. ట్రావెల్ డైరీస్.. అంటూ లండన్ సంగతులను ఇలా అభిమానులతో పంచుకుంటోంది నమ్రతా మహేష్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News