ఫోటో స్టొరీ: మినీ చెఫ్.. డాటర్ అఫ్ మహేష్

Update: 2019-07-17 08:43 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రతల  గారాలపట్టి సితార పాప సోషల్ మీడియాలో చాలా పాపులర్.  అప్పుడప్పుడు మహేష్ లేదా నమ్రత సితారకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.  దీంతో ఫ్యాన్స్ కే కాకుండా అందరు నెటిజన్లకు సితార పరిచయమే.  సితార జులై 20 న పుట్టినరోజు జరుపుకుంటోంది.  దీంతో నమ్రత బర్త్ డే వీక్ అంటూ సితార పాప ఫోటోలను రోజూ పోస్ట్ చేస్తున్నారు.  

తాజాగా నమ్రత తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేశారు.  ఈ ఫోటోలో సితార ఓ ప్రొఫెషనల్ బేకర్ తరహాలో సీరియస్ గా బేకింగ్ చేస్తూ ఉంది.  ఈ ఫోటోకు "బేకింగ్ లో ఒక ఎక్స్ పర్ట్ లాగా చెయ్యేసినప్పుడు.. #2016 #బర్త్ డే వీక్.. #సితపాప టర్న్స్ సెవెన్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఫోటో పాతదే కానీ చాలా క్యూట్ గా ఉంది కదా? ఈ ఫోటోకు నెటిజన్లు లైకులతో హోరెత్తించారు.  ఈ ఫోటోకు "చాకో పాప".. "మినీ చెఫ్".. "చిట్టితల్లి సో క్యూట్" అంటూ కామెంట్లు పెట్టారు.

ఈ ఫోటో నే కాదు నిన్న మరో ఫోటోను కూడా పోస్ట్ చేశారు నమ్రత. ఆ ఫోటోలో సితార పాప రోడ్డు మీద స్టైల్ గా నడుము మీద చేయిపెట్టుకుని నిలబడింది.  మరో ఫోటోలో ఇంట్లో సోఫాలో కూర్చుని క్యూట్ పోజిచ్చింది.



Tags:    

Similar News