సౌత్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుంచి ఓ సినిమా వస్తోంది అంటే జనాల్లో ఒకటే ఆసక్తి నెలకొంటుందనడంలో సందేహం లేదు. బొంబాయి - దళపతి - ధృవనక్షత్రం - దిల్ సే - ఓకే బంగారం .. ఒకటేమిటి ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ సంచలనాలే ఉన్నాయి. అందుకే ఆయనని గెలుపుఓటములతో సంబంధం లేకుండా అభిమానులు ప్రేమిస్తూనే ఉంటారు. మణిరత్నం సినిమా మొదలు పెట్టారంటే ఆ సినిమా గురించిన అప్ డేట్స్ తెలుసుకోవాలన్న ఉత్కంఠ అందరిలో ఉంటుంది.
ప్రస్తుతం ఫ్యాన్స్ లో టాపిక్ అంతా నవాబ్ గురించే. ఈ సినిమా నుంచి ఇప్పటికే అరవింద స్వామి గెటప్ - విజయ్ సేతుపతి - శింబు గెటప్ లను రివీల్ చేశారు. ఇవన్నీ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా కథానాయికల్లో ఒకరైన డయానా ఎరప్ప గెటప్‌ని రివీల్ చేశారు. శింబుకి ఈ భామ జోడీగా నటిస్తోందని పోస్టర్ చెబుతోంది. రుద్ర పాత్రలో శింబు నటిస్తుంటే - అతడికి జోడీగా ఛాయా పాత్రలో డయానా నటిస్తోంది. ఈ పెయిర్ మధ్య రొమాన్స్ ఆకట్టుకోనుందని పోస్టర్ చెబుతోంది. ఈ లుక్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది.
ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండగా - సంతోష్ శివన్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. తెలుగులో లిరిక్స్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అందిస్తున్నారు. మన్సూర్ అలీఖాన్ - జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్ డేట్ ని టాలీవుడ్ టాప్ పీఆర్ వో బిఏ రాజు ట్వీట్స్ ద్వారా అందిస్తున్నారు. నవాబ్ రాకకోసం తెలుగు ప్రేక్షకులకు క్యూరియస్ గానే వేచి చూస్తున్నారు. మరిన్ని అప్ డేట్స్ కోసం.. జస్ట్ వెయిట్..