• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓమిక్రాన్ తో షూట్ బంద్.....

ఓమిక్రాన్ తో షూట్ బంద్.. ప్రభాస్ మిస్సింగ్!!

By - Tupaki Desk
Update: 2022-01-12 04:30 GMT
పాన్ ఇండియా సినిమాలు చేయ‌డ‌మంటే ఆషామాషీనా? వ‌ర్క్ ప్రెజెర్ అంతే ఘ‌నంగా ఉంటుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌న్నివేశం ఎలా ఉంది? అంటే.. ప‌ని ఒత్తిళ్ల‌తో రెస్ట్ తీస్కునే టైమ్ లేక‌.. నిరంత‌రం బిజీ షెడ్యూళ్ల‌తోనే గ‌డిపాడు. చిన్న స‌మ‌యం దొరికినా గ్యాప్ లో కొత్త స‌బ్జెక్టులు కొత్త డైరెక్ట‌ర్లతో మంత‌నాలు సాగిస్తూ అస‌లు రాజీ అన్న‌దే లేకుండా ముందుకు సాగుతున్నాడు. అస‌లు పెళ్లి మాటే ఎత్త‌కుండా ఈ సీనియ‌ర్ బ్యాచిలర్ త‌న బిజీ లైఫ్ ని కొన‌సాగిస్తున్నాడు. స‌ల్మాన్ త‌ర్వాత మ‌ళ్లీ ప్రభాసే అన్నంతగా ఉంది స‌న్నివేశం.

ఇటీవ‌ల ఓమిక్రాన్ భయం షూటింగ్ లను రద్దు చేసింది. మ‌రి ఈ స‌మ‌యంలో ప్రభాస్ ఏం చేస్తున్నాడు? అంటే.. ప్రభాస్ అంతా స‌రిగా ఉంటే రాధే శ్యామ్ రిలీజ్ ముందు ప్ర‌చారం హ‌డావుడిలో ఉండేవాడు. అత‌డి అభిమానుల‌తో ఇంట‌రాక్ష‌న్స్ ఉండేవి. రాధేశ్యామ్ ఈ వారం విడుదల కావాల్సి ఉండగా కోవిడ్ భయం కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది.

దీంతో ప్రభాస్ అండర్ గ్రౌండ్‌కి వెళ్లి తనకు అవసరమైన విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలాగే ప్రస్తుతం ఆయన హిందీ చిత్రాలకు స్క్రిప్ట్ లు వింటున్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా ఇద్దరు యువ అప్ క‌మ్  హిందీ డైరెక్ట‌ర్స్ ప్రభాస్ కి స్క్రిప్ట్ లను వినిపించారని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌శాంత్ నీల్ తో - సలార్.. నాగ్ అశ్విన్ తో- ప్రాజెక్ట్ కే.. ఓంరౌత్ తో- ఆదిపురుష్ చిత్రీక‌ర‌ణ‌లు సాగుతున్నాయి. త‌దుప‌రి అత‌డితో సందీప్ వంగా స్పిరిట్ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తారు. అనంత‌రం ఏ లక్కీ డైరెక్టర్ కి ప్రభాస్ ని డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందో చూడాలి. ఇంత‌కుముందు సాహో తో న‌వ‌త‌రం ట్యాలెంట్ సుజీత్ కి అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌భాస్ ఈసారి కూడా న‌వ‌త‌రానికి అవ‌కాశం క‌ల్పిస్తాడా? అన్న‌ది వేచి చూడాలి.
Tags:    
  • spirit Movie 
  • spirit Movie teaser 
  • spirit Movie story 
  • prabhas25 
  • sandeep reddy vanga 
  • radhe shyam 
  • salaar 

Similar News

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS