చలితో కరోనా వస్తుందనేది అబద్ధం.. మరి నిజమేంటి.. కొత్త అధ్యయనంలో షాకింగ్ నిజాలు
చలికాలం వస్తుంది.. మనం మరింత జాగ్రత్తగా ఉండాలి.. కరోనా విజృంభించే అవకాశం ఉన్నదని ఇటీవల వైద్య నిపుణులు తెగ హెచ్చరిస్తున్నారు. కానీ కరోనా వ్యాప్తికి అసలు కారణం మనుషుల్లో ఉన్న అజాగ్రత్తే తప్ప.. వాతావారణ మార్పు ఎంత మాత్రమూ కాదని తాజాగా ఓ పరిశోధన తేల్చిచెబుతున్నది. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తిరగడం.. మాస్కులు, భౌతికదూరంగా పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ మహమ్మారి వ్యాపిస్తున్నదని తాజా అధ్యయనం చెబుతున్నది. కరోనా వైరస్ విపరీతంగా పెరగడానికి వాతావరణ మార్పు చాలా తక్కువ ప్రభావాన్ని చూపుతుందని సైంటిస్టులు అంటున్నారు. ఉష్ణోగ్రత, తేమ వంటివి కరోనా వ్యాప్తిలో కీలక పాత్ర పోషించవని తేలింది.
అస్టిన్‌లోని యూనివర్శిటీ టెక్సాస్ పరిశోధకుల బృందం కరోనా వ్యాప్తిలో వాతావరణం అంటే ఉష్ణోగ్రతల హెచ్చు తగ్గులు ఏ మేరకు ప్రభావితం చూపుతాయని వాళ్లు పరిశోధన సాగించారు. ఈ పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి అనేది వేసవి కాలంలో చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనంలో శాస్త్రవేత్తలు భావించారు. కానీ కరోనా వ్యాప్తిలో ఉష్ణోగ్రతలు ఏ మాత్రం ప్రభావం చూపవని వాళ్లు తేల్చిచెప్పారు. మనుషుల వ్యక్తిగత ప్రవర్తన, జీవన శైలి ఆధారంగానే కరోనా వ్యాప్తి చెందుతోందని వెల్లడించారు. ‘కరోనా వ్యాపించడంలో వాతావరణం పాత్ర చాలా తక్కువ..
ఈ మహమ్మారి మనుషుల నిర్లక్ష్యం వల్లే ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్నది’ అని యూటీ అస్టిన్ జాక్సన్ స్కూల్ ఆఫ్ జియో సైన్సెస్ అండ్ కోక్రెల్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, టీమ్ లీడర్ దేవ్ నియోగి అన్నారు. అమెరికాలో 2020 మార్చి, జూలై నెలల్లో వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తికి ఎన్ని విధాలుగా ప్రభావితం చేస్తుందో విశ్లేషించారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా సెల్ ఫోన్ డేటా ఆధారంగా హ్యుమన్ బిహేవియర్, కరోనా వ్యాప్తికి మధ్య సంబంధంపై కూడా పరిశోధక బృందం లోతుగా అధ్యయనం చేసింది. ఇందులో వాతావరణం అంతంగా కరోనా వ్యాప్తిపై ప్రభావితం చేయలేదని గుర్తించారు. ఇంట్లో కంటే బహిరంగ ప్రదేశాల్లో ఉంటే కరోనా వ్యాప్తికి 34 శాతం, 26శాతంగా ఎక్కువగా అవకాశం ఉంటుందని రుజువైంది. అలాగే జనాభాతో పాటు పట్టణ సాంద్రతతో కూడా 23శాతం నుంచి 13శాతంగా ఉందని గుర్తించారు.