• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆసక్తిని రేకెత్తిస్తున్న...

ఆసక్తిని రేకెత్తిస్తున్న 'శేఖర్‌'

By - Tupaki Desk
Update: 2021-11-23 04:57 GMT
సీనియర్‌ స్టార్‌ హీరోల్లో ఒక్కడైన రాజశేఖర్‌ ఈమద్య కాలంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ లను దక్కించుకోలేక పోతున్నాడు. హీరోగా చేస్తున్న సినిమాలు నిరాశ పర్చుతున్న సమయంలో అనూహ్యంగా వచ్చిన గరుడవేగ సినిమా సక్సెస్ ఆయనకు మంచి బూస్ట్‌ ను ఇచ్చింది. గరుడ వేగ సినిమాకు ముందు రాజశేఖర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా.. విలన్ పాత్రలను చేయాలని నిర్ణయానికి వచ్చాడనే వార్తలు వచ్చాయి. అయితే గరుడవేగ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మళ్లీ హీరోగా వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న ఈయన మొదటగా శేఖర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

మలయాళ మూవీ జోసెఫ్‌ కు ఈ సినిమా రీమేక్ అనే విషయం తెల్సిందే. మంచి కథ మరియు కథనంతో ఆ సినిమా మలయాళంలో రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా కథ మరియు కథనాలు ఉండటం వల్ల తెలుగు లో రీమేక్ చేసేందుకు గాను రాజశేఖర్ ఆసక్తి చూపించాడని తెలుస్తోంది. లలిత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ రీమేక్ షూటింగ్ ముగించినట్లుగా సమాచారం అందుతోంది. గతంలోనే ఈ సినిమా లో రాజశేఖర్ లుక్ ను రివీల్‌ చేయడం జరిగింది. ఇప్పుడు రాజశేఖర్ ఫస్ట్‌ లుక్ ను మరింతగా రివీల్‌ చేయడం జరిగింది. తెల్ల గడ్డం మరియు జుట్టుతో రఫ్‌ లుక్ లో రాజశేఖర్ కనిపిస్తున్నాడు.

ఇప్పటి వరకు చూడని రాజశేఖర్ ను 'శేఖర్‌' సినిమాలో చూడబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ ను చూస్తుంటే అనిపిస్తుంది. సినిమా చిత్రీకరణ మొదలు పెట్టింది మొదలు సినిమాపై సినీ జనాల్లో ఆసక్తి కనిపిస్తుంది. తాజాగా పస్ట్‌ లుక్ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి. సినీ జనాలతో పాటు మీడియా వర్గాల వారు మరియు ప్రేక్షకులు కూడా సినిమా పై ఆసక్తితో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. ఇంట్రెస్టింగ్‌ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. రాజశేఖర్‌ కెరీర్‌ మరోసారి బూస్టప్ అవ్వడానికి ఈ సినిమా ఖచ్చితంగా ఉపయోగదాయకంగా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ఈనెల 25వ తారీకున విడుదల కాబోతున్నాయి. ఆ సమయంలో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Tags:    
  • Shekhar First Glimps Update 
  • Rajasekhar movies 
  • Rajasekhar songs 
  • kalki 

Similar News

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS