శంకర్ 'ఇండియ‌న్ 2' సినిమాని హోల్డ్ లో పెట్టలేదా...?

Update: 2020-11-04 01:30 GMT
భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో శంకర్ ఒకరు. భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన శంకర్ దర్శకత్వంలో ఒక్కసారి నటించినా చాలని స్టార్ హీరో హీరోయిన్స్ సైతం కోరుకుంటారు. ప్రొడ్యూసర్స్ కూడా ఎంత బడ్జెట్ పెట్టడానికైనా ముందుకు వస్తుంటారు. అయితే ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన 'ఇండియన్ 2' బడ్జెట్ విషయంలో మాత్రం నిర్మాతలకి శంకర్ కు మధ్య విబేధాలు తలెత్తుతున్నాయని వార్తలు వస్తున్నాయి. లోకనాయకుడు కమల్ హాసన్ తో 'ఇండియన్ 2' సినిమా స్టార్ట్ చేసాడు శంకర్. ఈ మూవీలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. అనిరుధ్‌ సంగీతం సమకూర్చనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై నిర్మాత సుభాష్‌ కరణ్‌ 'ఇండియన్ 2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా 1996లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకి ఇది సీక్వెల్ గా రానుంది.

అయితే డైరెక్టర్‌ శంకర్‌ 'ఇండియన్‌-2' చిత్రాన్ని ప్రస్తుతానికి హోల్డ్‌ లో పెట్టారని.. లాక్‌ డౌన్‌ కారణంగా భారీగా తీయాల్సిన ఆ సినిమా షూటింగ్‌ ఇప్పుడు ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదని ఈ మధ్య వార్తలు వచ్చాయి. అంతేకాకుండా శంకర్‌ మరో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారని.. కన్నడ స్టార్ హీరో య‌శ్ - కోలీవుడ్‌ మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి లతో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే శంకర్ సన్నిహితులు చెప్తున్న దాని ప్రకారం ఇవన్నీ రూమర్స్ అని తెలుస్తోంది. శంక‌ర్ 'ఇండియ‌న్ 2' సినిమాని పక్కన పెట్టలేదని అంటున్నారు. కాకపోతే శంక‌ర్ అడిగిన బడ్జెట్ లో లైకా ప్రొడక్షన్స్‌ టీమ్ చాలా వరకు కోతలు విధిస్తున్నార‌ని చెబుతున్నారు. మరి శంకర్‌ 'ఇండియన్‌-2' ప్రాజెక్ట్ పై అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Tags:    

Similar News