• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బట్టలు అరువు తెచ్చుకున్న...

బట్టలు అరువు తెచ్చుకున్న స్టార్ హీరో!

By - Tupaki Desk
Update: 2019-05-10 07:50 GMT
'అర్జున్ రెడ్డి' సినిమాను 'కబీర్ సింగ్' టైటిల్ తో హిందీలో తెరకెక్కిస్తున్నారనే సంగతి తెలిసిందే.  షాహిద్ కపూర్.. కియారా అద్వాని ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఒరిజినల్ సినిమా దర్శకుడు సందీప్ వంగానే రీమేక్ చిత్రానికీ డైరెక్టర్ కావడంతో హిందీ ప్రేక్షకులలోనే కాకుండా తెలుగు ఆడియన్స్ లో కూడా 'కబీర్ సింగ్ పై ఆసక్తి నెలకొంది.  ఈ సినిమా జూన్ 21 న రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ ప్లాన్ చేశారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఆడియన్సుకు ఆసక్తిని మరింతగా పెంచుతున్నాయి  ఈ సినిమాలో షాహిద్ ఒక కాలేజ్ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నాడు.  స్టూడెంట్ గా తన కాస్ట్యూమ్స్ సహజంగా ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో కొందరు నిజమైన స్టూడెంట్స్ దగ్గర బట్టలను అరువు తెచ్చుకున్నాడట. ఆ స్టూడెంట్స్ తో రెగ్యులర్ గా స్పెండ్ చేస్తూ వారి హావభావాలను గమనించేవాడట.  తను పోషించే పాత్రను సరిగా అర్థం చేసుకోవాడనికి ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు.  షాహిద్ ను చూస్తుంటే ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడని అనిపిస్తోంది కదా?

జస్ట్ స్టూడెంట్స్ బట్టలు చేబదులు తీసుకుంటేనే కష్టం ఏంటంటారా.. ఇదొక్కటే కాదు.  షూటింగ్ కోసం డైలీ 20 సిగరెట్లు కాల్చాల్సి వచ్చిందని కొద్ది రోజుల క్రితం వెల్లడించాడు.  మళ్ళీ తన పిల్లలతో ఆడుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో సిగరెట్ కంపు పోవడానికి దాదాపు గంట స్నానం చేసేవాడట. "అబ్బో చాలా కష్టపడ్డాడు" అని ఇప్పుడైనా అంటారా లేదా ?


    

Tags:    
  • Shahid Kapoor 
  • Kabir Singh 
  • College Students Clothes 
  • Latest News 
  • Telugu News 

Similar News

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS