'ఆచార్య' టీజర్ ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా: చిరు
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''ఆచార్య''. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కాజల్ కిచ్లు హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కొరటాల శివ ఈ చిత్రాన్ని తనదైన శైలిలో సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు జోడించి రూపొందిస్తున్నాడని తెలుస్తోంది. దేవాదయ భూములు - నక్సలిజం నేపథ్యంలో ఉండే ఈ చిత్రం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ షూటింగ్ జరుగుతోంది. 'ఆచార్య' అప్డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం చిరు సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు.
'ఆచార్య' టీజర్ అప్డేట్ కోసం కొరటాలతో డిస్కస్ చేసినట్లు వెల్లడించిన చిరు.. రేపు ఉదయం 10 గంటలకు అప్డేట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి - కొరటాల మధ్య జరిగిన సంభాషణ అంటూ ఓ ఇమేజ్ షేర్ చేసాడు. ఇందులో 'ఆచార్య' టీజర్ న్యూ ఇయర్ కి ఇవ్వలేదు.. సంక్రాంతి కి లేదు.. ఇంకెప్పుడు?.. టీజర్ ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి నేను రెడీగా ఉన్నానంటూ ఫన్నీ వే లో ఈ అప్డేట్ ఇచ్చారు చిరు. ఏదేమైనా ఆచార్య నుంచి ఏదొక న్యూస్ వస్తే చాలనుకుంటున్న ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆ అప్డేట్ ఎప్పుడో తెలియాలంటే రేపు ఉదయం వరకు ఆగాల్సిందే.