క‌రోనాతో హీరోయిన్‌ భ‌ర్త మృతి!

Update: 2021-04-27 03:56 GMT
సీనియ‌ర్ హీరోయిన్ మాలాశ్రీ ఇంట్లో విషాదం నెల‌కొంది. ఆమె భ‌ర్త కుణిగ‌ల్ రాము(52) క‌రోనా కాటుకు బ‌ల‌య్యారు. వారం రోజుల‌ క్రితం ఆయ‌న‌కు వైర‌స్ సోకింది. అప్ప‌టి నుంచి బెంగ‌ళూరు న‌గ‌రంలోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించి సోమ‌వారం సాయ‌త్రం ప్రాణాలు కోల్పోయారు.

క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో రాము ప్ర‌ముఖ‌ నిర్మాత. శాండ‌ల్ వుడ్ లో దాదాపు 40 సినిమాల‌ను ఆయ‌న నిర్మించారు. లాక‌ప్ డెత్‌, క‌లాసిపాళ్య‌, ఏకే47 వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను ఆయ‌న నిర్మించారు. ఇక‌, ఆయ‌న భార్య మాలాశ్రీ తెలుగు ప్రేక్ష‌కుల సుప‌రిచిత‌మే.

తెలుగుతోపాటు త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో స్టార్‌ హీరోయిన్ గా వెలుగొందింది. క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరోయిన్ గా ఉన్న స‌మ‌యంలోనే మాలాశ్రీని రాము వివాహం చేసుకున్నారు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. రాము చ‌నిపోయార‌న్న విష‌యం తెలియ‌డంతో సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న మృతిప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News