రూ.70 లక్షలు మోసపోయిన సీనియర్ నటి

Update: 2021-08-08 14:30 GMT
సినిమా ఇండస్ట్రీలో చీటింగ్ లు అనేవి చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. మేనేజర్ లు పారితోషికాల విషయంలో నిర్మాతలో మాట్లాడింది ఒకటి.. నటీ నటులకు సాంకేతిక నిపుణులకు ఇచ్చేది మరోటి ఉంటుంది. అలా ఒక సీనియర్ నటి మేనేజర్ ఆమెను ఏకంగా 70 లక్షల వరకు మోసం చేశాడట. సౌత్‌ లో స్టార్‌ గత సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఆమె ఈమద్య కాలంలో కాస్త సినిమాలు తగ్గించింది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా నటించి మెప్పించిన ఆ సీనియర్‌ నటి తన మేనేజర్ ను గుడ్డిగా నమ్మిందట. పెద్ద మొత్తంలో నిర్మాతల నుండి పారితోషికాలు తీసుకుని నటికి చాలా తక్కువ పారితోషికం ఇచ్చేవాడట. ఇన్నాళ్లు గుర్తించని ఆమెకు ఎట్టకేలకు ఆ విషయం తెలిసిందట.

తాను వర్క్‌ చేసిన సినిమాల ప్రొడక్షన్‌ మేనేజర్ లను మరియు నిర్మాతలను సంప్రదించగా ఆమె షాక్‌ అయ్యే విషయం తెల్సిందట. సినిమాల్లో నటిగా నటించుకుంటూ వెళ్తున్న ఆమె పారితోషికం విషయంలో పట్టించుకోకుండా ఉండటం వల్లే ఈ నష్టం జరిగిందట. ఇప్పటి వరకు ఆమెకు తెలిసిన లెక్కల ప్రకారం 70 లక్షల రూపాయల వరకు పోయినట్లుగా గుర్తించారట. ఆమె ఇప్పటికే ఆ మేనేజర్ పై చీటింగ్‌ కేసును పెట్టేందుకు సిద్దం అయ్యిందటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి మోసాలు ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి కాని బయట పడటం చాలా తక్కువ.

సీనియర్‌ నటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. సినిమాల్లో ఆమె చాలా గడుసుగా ఉంటుంది. ఆమెకు ఇండస్ట్రీలో కూడా రెబల్‌ అనే పేరు దక్కించుకుంది. కాని మేనేజర్‌ ను గుడ్డిగా నమ్మేసి మోస పోయింది. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది మేనేజర్ ల వల్ల మోస పోతూనే ఉన్నారు. అందుకే మేనేజర్‌ లుగా ఎక్కువ మంది తెలిసిన వారిని లేదా తమ సొంత వారిని పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొందరికి మాత్రం అలా వీలు లేక పోవడం వల్ల బయటి వారిపై ఆదారపడితే ఇలా మోసపోవాల్సి వస్తుంది.
Tags:    

Similar News