చిన్న సినిమా లాంచ్.. ఇంతమంది పెద్దోళ్లెందుకొచ్చారు?
సెహరి’ పేరుతో టాలీవుడ్ లో ఒక కొత్త సినిమా మొదలైంది మంగళవారం. ఇందులో హీరోగా నటిస్తున్న హర్ష్ కనుమిల్లి కొత్తవాడు. కథానాయికగా చేస్తున్న సిమ్రాన్ చౌదరికి కూడా పెద్దగా గుర్తింపు లేదు. ఆమె ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి ఒకటీ అరా సినిమాల్లో కనిపించింది. దర్శకుడిగా పరిచయం అవుతున్న గంగా సాగర్ ద్వారక కూడా కొత్తవాడే. నిర్మాత అద్వయ జిష్ణు రెడ్డి పేరు కూడా ఎప్పుడూ విన్నది లేదు. అతను కూడా ప్రొడక్షన్‌కు కొత్తే. కానీ ఈ సినిమా ప్రారంభోత్సవంలో టాలీవుడ్ పెద్దలు చాలామందే కనిపించారు. దిల్ రాజు ఈ సినిమాకు క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ కెమెరా స్విచాన్ చేశాడు. సీనియర్ సంగీత దర్శకుడు కోటి కూడా, ఏషియన్ సినిమాస్ కు చెందిన భరత్ నారంగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరి ఇంత మంది పెద్దోళ్లు ఈ సినిమా వేడుకలో ఎందుకు కనిపించారు.. సోషల్ మీడియా లో కూడా ఈ సినిమాకు ఎందుకు మంచి ప్రచారం లభిస్తోంది అన్నది ఆశ్చర్యం కలిగించే విషయమే.ఇదంతా నిర్మాతకు ఉన్న బ్యాగ్రౌండ్ వల్లే సాధ్యమైంది. అద్వయ జిష్ణు రెడ్డి ఎవరో కాదు.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి స్వయానా మేనల్లుడు. కిరణ్ ముఖ్యమంత్రిగా ఉండగా అతడి పేరు ఎప్పుడూ వినిపించలేదు. ఆయన దిగిపోయిన ఆరేళ్లకు అద్వయ నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నాడు. కిరణ్ ఇప్పుడు ఏమాత్రం లైమ్ లైట్లో లేకపోయినప్పటికీ.. ఆయన పలుకుబడి బాగానే పని చేసి టాలీవుడ్ పెద్దలు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మీడియాలో, సోషల్ మీడియాలో ఈ సినిమాకు మంచి పబ్లిసిటీనే లభిస్తోంది. అద్వయ జిష్ణురెడ్డి వరుసగా సినిమాలు చేయడానికి ప్రణాళికలు రచించుకుని రంగంలోకి దిగాడట. మరి ఆయనకిక్కడ ఎలాంటి ఆరంభం లభిస్తుందో చూడాలి.