ఈ పాప పూరీకి ప‌నికొస్త‌దేమో!?

Update: 2019-02-03 01:30 GMT
బ్రెజిల్, ఇట‌లీ, లండ‌న్, మెల్ బోర్న్ .. న‌గ‌రం ఏదైనా అక్క‌డి నుంచి టాప్ మోడ‌ల్స్ ముంబైలో దిగిపోతే చాలు. టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ పూరి ఇట్టే స్కాన్ చేసేస్తారు. ఆయ‌న స్కాన్ చేసి ఓ ఐటెమ్ నంబ‌ర్ తో బ‌రిలో దించితే ఆ మోడ‌ల్ కి ఉండే భ‌విష్య‌త్ వేరుగా ఉంటుంది. అదిరిపోయే హాట్ ఐటెమ్ నంబ‌ర్ల‌తో అలా ఎంద‌రికో లైఫ్ నిచ్చిన గురుడు పూరి జ‌గ‌న్నాథ్. అందుకే ఆయ‌న రేంజుకు త‌గ్గ టాప్ రేంజ్ మోడ‌ల్ ముంబైలో దిగిపోవ‌డం ప్ర‌స్తుతం వేడెక్కిస్తోంది. అయితే ఆ సంగ‌తి పూరికి చేరిందో లేదో తెలీదు కానీ ఇప్ప‌టికైతే స‌ద‌రు మోడ‌ల్ గుబులు గుబులుగా ర‌గిలిస్తోంది!!

ఇంత‌కీ ఎవ‌రీ టాప్ మోడ‌ల్? అంటే సారా సంపోయా. విక్టోరియా సీక్రెట్ ఫ్యాష‌న్ గాళ్ గా సుప‌రిచితం. 2013- 15 సీజ‌న్ ని అల్లాడించింది ఈ బ్యూటీ. సూప‌ర్ మోడ‌ల్ గా ఇప్ప‌టికే ప‌లు ఫోటోషూట్ల‌తో వెబ్ ని వేడెక్కించింది సారా. ఆ క్ర‌మంలోనే ముంబై సినీప‌రిశ్ర‌మ కూడా ఈ అమ్మ‌డిపై దృష్టి సారించింది. మొత్తానికి విక్టోరియా సూప‌ర్ గాళ్ సారా బ‌రిలో దిగిపోయింది. అది కూడా బాలీవుడ్ టాప్ హీరో ర‌ణ‌వీర్ తో క‌లిసి ఓ ఫ్యాష‌న్ మ్యాగ‌జైన్ ఫోటోషూట్ లో పాల్గొంది.

అందులోంచి ఓ ఫోటో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లోకి లీకైంది. ఈ లీక్డ్ ఫోటోలో సారా వేడెక్కించే అందానికి ప్ర‌పంచం దాసోహం అనేస్తోంది. యూత్ గుండెల్లో గుచ్చేసిన ఈ అమ్మ‌డికి ర‌ణ‌వీర్ ప‌డిపోకుండా ఉంటాడా? ఇక ర‌ణ‌వీర్ ఏపాటి!! అన్న‌ట్టే ఉందా దృశ్యం. ర‌ణ‌వీర్ - సారా జంట‌పై లండ‌న్ లో అదిరిపోయే ఫోటో షూట్ ని చేశారు. లండ‌న్ లోని రెస్టారెంట్లు, మ‌ల్టీప్లెక్సులు, ఔట్ డోర్ లొకేష‌న్స్ వేటినీ వ‌దిలిపెట్ట‌లేద‌ట‌. ఇక సారా సంపోయా టాలీవుడ్ కి కూడా ఇంపోర్ట్ అవుతుందేమో చూడాలి.
Tags:    

Similar News