ఆ స్టార్ హీరో 50 లో సందీప్ కిషన్!
యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటు వెళ్లిపోతుంటాడు. తెలుగు..తమిళ్ లో ఇదే దూకుడు కొంత కాలంగా కొనసాగిస్తున్నాడు. అలాగని కేవలం హీరో రోల్స్ కే పరిమితం కాడు. అప్పుడప్పుడు స్టార్ హీరోల చిత్రాల్లో సైతం అవకాశం వస్తే నటిస్తాడు. నటడు కేవలం తన సినిమాలకే పరిమితం కాకూడదు అన్న దృక్కోణంలో ఉంటాడు.
అందుకే అవకాశం వస్తే హీరో ఇమేజ్ తో పనిలేకుండా వృత్తికి న్యాయం చేస్తున్నాడు. తాజాగా స్టార్ హీరో దనుష్ ల్యాండ్ మార్క్ చిత్రం 50 లో నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే ధనుష్ 'సార్' తో తెలుగు..తమిళ్ లో పెద్ద విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ధనుష్ కి తెలుగులో మంచి గుర్తింపునిచ్చింది. నటుడిగా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
ఈనేపథ్యంలో 50వ సినిమాని అంతే ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ధనుష్ మెగా ఫోన్ పడుతున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ నేపథ్యంలో నటీనటు లు అంతా పేరున్న వారినే తీసుకుంటున్నారు. దుషార విజయన్..ఎస్ జె సూర్య.. విష్ణు విశాల్..కాళీదాస్ నటిస్తున్నారు. వాళ్లతో పాటు తెలుగు యువ హీరో సందీప్ కి షన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. సందీప్ కిషన్ అయితేనే ఆ పాత్ర కు న్యాయం చేస్తాడని ధనుష్ ఏరికోరి మరీ ఎంపిక చేసినట్లు సమాచరాం.
మరి ఆ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రానికి' రాయన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాకి ఏ. ఆర్ .రెహమాన్ సంగీతం అందిస్తున్నారుట. రెహమాన్ అయితేనే బెస్ట్ ఔట్ ఫుట్ వస్తుందని ధనుష్ భావించి సంగీత దిగ్గజాన్ని ఒప్పించినట్లు తెలుస్తుంది.