దయ చూపించండి..సామ్ పోస్ట్ వైరల్!
క్రేజీ హీరోయిన్ సమంత గత కొన్ని నెలలుగా మయో సైటీస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే.ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న సమంత ప్రస్తుతం దీని నుంచి కోలుకుంటోంది.ప్రత్యేక చికిత్స తీసుకుంటూ మునుపటి హుషారుతో కనిపిస్తున్న సామ్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకెలు రూపొందిస్తున్న 'సీటాడెల్' ఇండియన్ వెర్షన్ లో నటిస్తోంది.గత కొన్నిరోజులుగా ముంబాయికి మకాం మార్చేసిన సమంత అక్కడే షూటింగ్ లో పాల్గొంటోంది.
వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటూనే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూ అభిమానులతో టచ్ లో వుంటోంది. ఇటీవలే 'ఖుషీ' షూటింగ్ ని పక్కన పెట్టి 'సీటాడెల్' షూటింగ్ లో పాల్గొంటున్నందుకు గానూ విజయ్ దేవరకొండ అభిమానులకు సారీ చెప్పిన సమంత ఆ తరువాత బాక్సింగ్ చేస్తున్న పలు ఫొటోలని అభిమానులతో పంచుకుంది. గత కొన్ని రోజులుగా మయోసైటీస్ నుంచి కోలుకుంటున్న సమంత తాజాగా షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
తాజాగా ఇన్ స్టా వేదికగా 'దయ చూపించండి' అంటూ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అంతే కాకుండా ఇన్ స్టా స్టోరీస్ లో తన ఫొటోని పంచుకున్న సమంత ఎవరు ఏ సమస్యతో పోరాడుతున్నారో తెలియదు. అందుకే అందరిపై దయ చూపించండి' అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఇన్ స్టా స్టోరీస్ లో సమంత ఫొటోనిచూసిన వారంతా మీలాగే మీ మనసు కూడా చాలా అందమైనది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
ప్రస్తుతం సామ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విపత్కర పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడి మయోసైటీస్ నుంచి కోలుకుంటోంది. ఇదిలా వుంటే సమంతపై బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ప్రశంసలు కురిపించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ బాజ్ పాయ్ .. సమంతని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదీ పట్టించుకోకుండా ముందుకు సాగిపో అంటూ సామ్ కు ధైర్యం చెప్పాడు.
తన ఇంటర్వ్యచూ వీడియోని షేర్ చేసినసమంత 'ప్రయత్నిస్తాను సార్' అంటూ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. మనోజ్ బాజ్ పాయ్ మాట్లాడుతూ 'సమంత చాలా కష్టపడి పని చేస్తుందని, 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ సమయంలో తన పనితనం చూసి ఆశ్చర్యపోయానన్నారు. సన్నివేశం బగా రావడానికి తన శరీరాన్ని ఎంత కష్టపెట్టడానికైనా సామ్ సిద్ధపడుతుంది' అని తెలిపాడు. సామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'శాకుంతలం' ఏప్రిల్ 14న విడుదల కానున్న విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.