'స‌లార్‌' క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ కు పండగే!

Update: 2021-03-27 02:30 GMT
రెబ‌ల్ స్టార్ ప్రభాస్ - సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీ సలార్. కేజీఎఫ్ తో దేశ‌వ్యాప్తంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ప్ర‌శాంత్‌.. ప్ర‌భాస్ ను ఏ రేంజ్ లో చూపించ‌బోతున్నాడో అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో నెల‌కొంది. టైటిల్ పోస్ట‌ర్ తోనే దుమ్ములేపిన ద‌ర్శ‌కుడు.. ఇక ప్ర‌భాస్ క‌టౌట్ ను తెర‌పై ఏ విధంగా ఆవిష్క‌రిస్తాడోన‌ని ఎదురు చూస్తున్నారు.

రాధేశ్యామ్ కు ప్యాక‌ప్ చెప్పిన వెంట‌నే.. స‌లార్ టీమ్ లో ‌చేరిపోయాడు ప్ర‌భాస్‌. సింగ‌రేణి గ‌నుల్లో తొలి షెడ్యూల్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ.. ఈ మ‌ధ్య రెండో షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ప్ర‌కారం.. మూడో షెడ్యూల్ ను హైద‌రాబాద్ లో ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఇందుకోసం రాజ‌ధాని శివారులో భారీ సెట్ నిర్మిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సెట్ కంప్లీట్ కాగానే.. మూడోషెడ్యూల్ ప్రారంభ‌మ‌వుతుంద‌ట‌. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ కంప్లీట్ అయిన షెడ్యూల్స్ తో కంపేర్ చేస్తే.. ఇదే లెంగ్తీ షెడ్యూల్ అట‌. సినిమాలోనే ఎక్కువ భాగాన్ని  ఎక్క‌డ షూట్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో స‌లార్ క్వీన్ గా శృతిహాస‌న్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్లో అద్దిరిపోయే ఐట‌మ్ సాంగ్ కూడా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇందులో కేజీఎఫ్ చాప్ట‌ర్‌-1 బ్యూటీ శ్రీనిధి శెట్టి చిందేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. హోంబ‌లే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది.
Tags:    

Similar News