రౌడీ పిల్లనే పచ్చిగా అడిగాడట.. ఎవరా డైరెక్టర్?
పొట్టి నిక్కర్లు మిడ్డీలు ధరించమని అడగాలే కానీ మోడ్రన్ గాళ్స్ అభ్యంతరం చెప్పే సన్నివేశం ఉందా? అది కూడా ఓ సినిమాలో కథానాయికగా ఆఫర్ ఇచ్చి చెలరేగిపొమ్మని అడగాలే కానీ వెనకాడేదెవరు? సోషల్ మీడియా- డిజిటల్ యుగంలో ఓవర్ ఎక్స్ పోజింగ్ సెక్సిపోజింగ్ కామన్ అయిపోయిన ఈ రోజుల్లో కూడా ఇంకా పొట్టి నిక్కరు వేయను.. పిక్కల పైకి మిడ్డీ వేయలేను! అంటూ నిష్కర్షగా డైరెక్టర్లకు చెప్పేసేవాళ్లుంటారా? అంటే..
ఎందుకు ఉండరు! ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఈ తరహానే. రౌడీ పిల్లగా రౌడీ బ్రాండ్ తో పాపులరైన ఈ బ్యూటీ తనకు తానుగానే కొన్ని కండీషన్లు పెట్టుకుని జీవిస్తోంది. అయినా తనకు అవకాశాల పరంగా కొదవేమీ లేదు. ప్రేమమ్ - ఫిదా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంతో ఆ ఇమేజ్ ఇప్పటికీ సాయి పల్లవికి అవకాశాలు తెచ్చి పెడుతోంది. ఇక సాయిపల్లవి డ్యాన్సింగ్ స్కిల్స్ కి యూత్ విపరీతంగా ఫిదా అయిపోతుండడం కూడా అవకాశాలు తెచ్చి పెడుతోందని చెప్పాలి. ఎంతో సహజంగా కనిపిస్తూ పక్కింటి అమ్మాయిలా తన పాత్రలో ఒదిగిపోయే ఈ అమ్మడికి ఓసారి ఓ కొత్త ప్రపోజల్ వచ్చిందట.
ఆ ప్రపోజల్ ప్రకారం..ఒళ్లంతా విప్పి చూపించాలి. ఒంటిపై వలువలు వలిచేయాలి! అంటూ ఓ డైరెక్టర్ సూటిగానే తనకు చెప్పేశాడట. అయితే అందుకు తాను ససేమిరా అని అతడి ముఖంపైనే చెప్పేసిందిట. ``టైట్ ఔట్ ఫిట్స్ ధరించి ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. గతంలో దర్శకులు అలా చేయమని ఒత్తిడి తెచ్చేవారు. కానీ అందుకు కుదరదని చెప్పేసేదానిని`` అని సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా లో మాత్రం సన్నివేశం డిమాండ్ మేరకు ఓచోట షార్ట్ డ్రెస్ ధరించేందుకు అంగీకరించానని తెలిపింది. ప్రస్తుతం రానా సరసన విరాటపర్వం చిత్రంలో సాయి పల్లవి నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటే పలువురు దర్శకులు వినిపించిన కథల్ని లాక్ చేసిందట.