• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగ్ సర్ కి...

నాగ్ సర్ కి చెప్పాలనుకున్నది చెప్పేసింది

By - Tupaki Desk
Update: 2021-09-30 08:34 GMT
లవ్ స్టోరీ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు సాయి పల్లవి ఫిదా చేసింది. సినిమా కు మిశ్రమ స్పందన వచ్చినా కూడా సాయి పల్లవి డాన్స్ మరియు నటన విషయంలో మంచి మార్కులు దక్కించుకుంది. మంచి పాత్ర పడితే ఏ స్థాయిలో సాయి పల్లవి జీవిస్తుందో మౌనిక పాత్రను చూస్తే అర్థం అవుతుంది. సినిమా సక్సెస్ మీట్ ను తాజాగా నిర్వహించారు. నాగార్జున గెస్ట్‌ గా హాజరు అయిన ఈ వేడుకలో సాయి పల్లవి మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించింది. సాయి పల్లవి డాన్స్ కు మరియు ఆమె నటనకు నాగార్జున ఫిదా అయినట్లుగా వ్యాఖ్యలు చేశాడు. ఆమె డాన్స్ చేస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడు. సాయి పల్లవి పై ప్రశంసల జల్లు కురిపించిన నాగార్జున గురించి కూడా ఆమె ఆసక్తికర విషయాన్ని వెళ్లడించింది.

తన చిన్నతనంలో నాకు చెల్లికి తాతయ్య అన్నమయ్య సినిమాను వంద సార్లు చూపించాడు. ఆ సినిమా టీవీలో వచ్చిన ప్రతి సారి కూడా తాతయ్య తప్పకుండా చూసేవారు. నాగార్జున గారు ఇంత అద్బుతంగా నటించారు అంటే ఆయన ఖచ్చితంగా పూర్వ జన్మలో ఒక యోగి లేదా రుషి అయ్యి ఉంటాడు అంటూ మాతో చెప్పేవాడు. క్లైమాక్స్ సీన్ లో దండం పెడుతూ సినిమాను అలాగే చూస్తు ఉండేవాడు తాతయ్య. నాగార్జున అంటే అంటే ఆయనకు అన్నమయ్య మాత్రమే. అందుకే ఆయన దృష్టిలో నాగార్జున గారిని అన్నమయ్య అన్నట్లుగానే ఉంచాలనే ఉద్దేశ్యంతో నాగ్‌ సర్ నటించిన మరే సినిమా వచ్చినా కూడా ఛానెల్‌ మార్చే వాళ్లం అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

తాతయ్య ఎప్పుడు  కూడా నాగార్జున గారిని అన్నమయ్య అనుకునేలా ఆయన ఇతర సినిమాలు ఎప్పుడు కూడా మా టీవీలో రాకుండా జాగ్రత్తపడేవాళ్లం అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని తాను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు వస్తే చెప్పాలనుకున్నాను.. కాని ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని లవ్ స్టోరీ సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చింది. సాయి పల్లవి ప్రస్తుతం టాలీవుడ్‌ తో పాటు ఇతర వుడ్‌ ల్లో కూడా బిజీగా వరుస సినిమాలతో దూసుకు పోతుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ అమ్మడి సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఈమెకు మాత్రం సినిమా సినిమాకు కూడా మంచి పేరు వస్తూనే ఉంది. టాలీవుడ్ లో ముందు ముందు ఈమె నుండి మరిన్ని మంచి పాత్రలు వస్తాయనే నమ్మకం అంతా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చక్కగా మాట్లాడటంతో పాటు తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటున్న అతి తక్కువ మంది టాప్ హీరోయిన్స్‌ లో సాయి పల్లవి ఒకరు అనడంలో సందేహం లేదు.
Tags:    
  • Annamayya Movie 
  • Nagarjuna Comments 
  • Naga chaitanya comments 
  • lovestory success meet 
  • Sekhar Kammula 
  • Naga Chaitanya 
  • Sai Pallavi 
  • Love Story 

Similar News

రామాయణంపై ఈ తరం వింత ప్రశ్న..!

2026-11-09 04:58 GMT

ర్యాపిడ్ ఫైర్ లో చైతూను ఇరికించేసిన సుమా.. ఏం క్లారిటీ గురూ!

2026-11-09 04:25 GMT

హీరోయిన్ అవ్వాలంటే.. అందమే ముఖ్యమా.. జాన్వీ..?

2026-11-09 04:25 GMT

వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో రేసులో అగ్ర నిర్మాణ సంస్థ

2026-11-09 04:24 GMT

ప్రభాస్ ఈ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే బాగుంటుందా?

2026-11-09 04:16 GMT

ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!

2026-11-09 03:40 GMT

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

Copyright @2026

Powered by Blink CMS