• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పుష్ప' మూడో పాట: 'సామీ...

'పుష్ప' మూడో పాట: 'సామీ సామీ' మాస్ ప్రోమో..!

By - Tupaki Desk
Update: 2021-10-25 11:32 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ''పుష్ప''. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. లారీ డ్రైవర్ పుష్ప రాజ్ అనే ఊర మాస్ పాత్రలో బన్నీ.. పల్లెటూరి అమ్మాయి శ్రీవల్లి గా రష్మిక కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ చేస్తున్న 'పుష్ప' టీమ్.. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన 'దాక్కో దాక్కో మేక' సాంగ్.. దసరా సందర్భంగా వచ్చిన 'శ్రీవల్లి' పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మూడో పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ''సామీ సామీ'' అనే పాటను అక్టోబర్ 28న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సాంగ్ మాస్ ప్రోమోని ఐదు బాషల్లో రిలీజ్ చేశారు.

'నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్లున్నాదిరా సామీ.. నా సామీ.. సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది సామీ.. నా సామీ..' అంటూ సాగిన ఈ పాట అలరిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన రెండు సాంగ్స్ కు భిన్నంగా కాస్త ఫోక్ టచ్ తో ఈ పాట సాగింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలకు గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. సింగర్ మౌనిక యాదవ్ హుషారుగా ఆలపించారు.

'సామీ సామీ' ప్రోమోని బట్టి ఇది పుష్పరాజ్ - శ్రీవల్లి మధ్య వచ్చే మంచి మాస్ బీట్ సాంగ్ అని అర్థం అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ పాట అందుబాటులోకి రానుంది. మిరోస్లా కుబా బ్రోజెక్ వె చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ''పుష్ప'' సినిమాని నిర్మిస్తున్నారు.







Full View


Tags:    
  • SaamiSaami 
  • PushpaTheRiseOnDec17 
  • Pushpa 
  • Pushpa release date 
  • Pushpa songs 
  • Allu arjun Pushpa 
  • rashmika 
  • Pushpa Shooting 

Similar News

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

రాజమౌళి సక్సెస్ కి శంకర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే...

2026-11-13 07:07 GMT

పవన్ కళ్యాణ్ కి ఓజీ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం ఏంటి?

2026-11-13 07:06 GMT

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన రామాయ‌ణం-1

2026-11-13 02:45 GMT

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS