అయితే పవన్‌.. లేకపోతే బన్నీ??

Update: 2016-06-01 01:30 GMT
కొంతమంది దర్శకులు తమ తదుపరి సినిమా ఏ హీరోతో చేస్తారు అనే విషయంపై ఫిలిం నగర్‌ లో చాలా ఆసక్తి ఉంటుంది. అలాంటి ఫిలిం మేకర్లలో త్రివిక్రమ్ ఒకడు. ఆయన నెక్ట్స్ మూవీ ఏంటనేది ఇప్పుడు టాలీవుడ్‌ లో అందరూ గుసగుసలాడుతున్న అంశం. కొన్ని ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్లు చూద్దాం పదండి.

యథావిదిగా త్రివిక్రమ్ తదుపరి సినిమా పవన్‌ కళ్యాణ్‌ తోనే అని ఒక రూమర్ చెక్కర్లు కొడుతోంది. మనోడు పవన్‌ కు మాంచి దోస్తీ కావడం వలన.. ఇక అందరూ అదే చెబుతుంటారులే. అలాగే మహేష్‌ తో ఒక సినిమా.. లేదంటే ఎవరన్నా ఒక చిన్న హీరోతో ఒక సినిమా అంటూ కూడా రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇదే విషయంపై నిర్మాత రాధాకృష్ణను అడిగితే.. ''ఇప్పటివరకు పవన్‌ కళ్యాణ్‌ కు ఒక కథ చెప్పాం. ఆయన ఓకె అంటారా లేదా అనే విషయం తెలియదు. ఇక నాకు పర్సనల్ గా వరుసపెట్టి బన్నీ తో సినిమా చేయాలని కోరిక. సూపర్ హీరో మనోడు. బట్ త్రివిక్రమ్ గారి తదుపరి సినిమా ఏదైనా.. దాని ప్రొడ్యూసర్ మాత్రం నేనే'' అంటూ చెప్పుకొచ్చారు.

ఆ లెక్కన చూస్తుంటే.. ఒకవేళ ఒప్పుకుంటే పవన్‌.. లేదంటే ఒక కథతో బన్నీని ఒప్పించేసి త్రివిక్రమ్ అతగాడితో ఒక సినిమా చేస్తాడా అనే సంగతి చూడాలి.
Tags:    

Similar News