దేవుడే దిగి వచ్చినా.. జస్ట్ రూమరే

Update: 2016-10-26 16:00 GMT
కాటమరాయుడు మూవీని సూపర్ స్పీడ్ లో కంప్లీట్ చేసేయాలన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలోచన. ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉండడం.. ఆర్టిస్టులందరి బల్క్ డేట్స్ ఉండడం.. వీలైనంతవరకూ సెట్స్ లోనే కంప్లీట్ చేసే అవకాశం ఉండడంతో జనవరి నాటికల్లా ఈ చిత్రాన్ని ఫినిష్ చేసి.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లోకి జంప్ అయిపోవాలని చూస్తున్నాడట పవన్. మాటల మాంత్రికుడితో పవర్ స్టార్ సినిమా ఆ టైమ్ కల్లా స్టార్ట్ అయిపోవాలన్నది.. ఇప్పటికి ఫిక్స్ చేసిన షెడ్యూల్.

జల్సా.. అత్తారింటికి దారేది తర్వాత పవన్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో.. మొదలుకాకముందే ఎక్స్ పెక్టేషన్స్ రైజ్ అయిపోయాయి. ''దేవుడే దిగి వచ్చినా'' అనే టైటిల్ ఫైనల్ చేశారని.. సమంతను లీడ్ హీరోయిన్ గా తీసుకున్నారని వార్తలు కూడా వచ్చేస్తున్నాయి. అయితే.. ఈ సినిమాకి సంబంధించినంతవరకూ ఇంకా స్క్రిప్ట్ కూడా లాక్ చేయలేదని అంటున్నారు. సినిమా స్టార్ట్ కానుందని అనౌన్స్ చేసేందుకుగాను.. నవంబర్ 5న కేవలం పూజా కార్యక్రమానికి మాత్రమే పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట.

నవంబర్ లో పూజ చేసినా.. షూటింగ్ మొదలు పెట్టేందుకు అక్కడి నుంచి కనీసం రెండు నెలలు టైమ్ పడుతుందని తెలుస్తోంది. అటు టైటిల్ కానీ.. ఇటు సమంత హీరోయిన్ అనే విషయం కానీ.. కేవలం రూమర్స్ అని తేలిపోయిందిపుడు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News