RRR విడుదల అప్పుడేనా..?

Update: 2020-12-16 06:00 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. RRR పేరుతో ఫేమస్ అయిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లలో తారక్ - చరణ్ పెర్ఫార్మెన్స్ కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో.. ఈ మూవీ ఎప్పడెప్పుడు విడుదలవుతుందా? అని దేశవ్యాప్తంగా జనం ఎదురు చూస్తున్నారు.

చివరి దశలో షూటింగ్..
కరోనాా వల్ల నిలిచిపోయిన చిత్ర షూటింగ్.. ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. చిత్రీకరణ చివరిదశకు వచ్చిందని సమాచారం. అయితే.. ఈ మూవీని ఎప్పుడు విడుదల చేయనున్నారనే విషయం ఆసక్తిగా మారింది. మొదట్లో కొన్ని డేట్స్ అనుకున్నప్పటికీ కుదరలేదు. దీంతో.. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న.

అన్నీ కలిసొస్తాయని..
థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. కరోనాా భయం ఇంకా తొలగిపోలేదు. షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వాాలి. ఇవన్నీ పూర్తయ్యే సరికి సమ్మర్ వచ్చేస్తుంది. అప్పటికి అన్నిపనులూ అయినప్పటికీ.. సినిమాాను మాాత్రం దసరాా సీజన్ కే బరిలో నిలపాలని యోచిస్తున్నాడట దర్శక ధీరుడు. అప్పటికి పరిస్థితులన్నీ చక్కబడడంతోపాటు పండగ సీజన్ కావడంతో మంచి వసూళ్లు వస్తాయని భాావిస్తున్నాడట. మరి, అధికాారికంగా రిలీజ్ కు ఏ ముహూర్తం ఫిక్స్ చేస్తారన్నది చూడాలి.
Tags:    

Similar News