మరోసారి స్టూడెంట్‌ లీడర్ అవ్వబోతున్న రౌడీస్టార్‌

Update: 2021-08-05 12:03 GMT
విజయ్‌ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాలో విభిన్నమైన పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో రౌడీ స్టార్‌ స్టూడెంట్‌ లీడర్ గా కనిపించిన విషయం తెల్సిందే. ఆ సినిమా విజయ్ దేవరకొండ నటనకు మంచి పేరు వచ్చినా కూడా కమర్షియల్‌ గా మాత్రం నిరాశ పర్చింది. రష్మిక మందన్న ఆ సినిమాలో నటించింది. స్టూడెంట్‌ లీడర్ పాత్రకు విజయ్ దేవరకొండ పూర్తిగా న్యాయం చేశాడు. అందుకే మరోసారి విజయ్‌ దేవరకొండుకు స్టూడెంట్‌ లీడర్‌ పాత్ర దగ్గరకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండతో కొరటాల శివ ఒక సినిమాను చేయాలని భావిస్తున్నాడట. అది స్టూడెంట్‌ యూనియన్‌ నేపథ్యంలో సాగే కథ అని.. స్టూడెంట్స్ రాజకీయం ఈ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు.

ఈ కథ ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తుంది కదా.. ఔను గతంలో ఈ కథతో అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. వీరిద్దరి కాంబో మూవీ పుష్ప తర్వాత పట్టాలెక్కనుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని పుష్ప రెండు పార్ట్‌ లుగా చేయడంతో పాటు ఐకాన్‌ సినిమాను వెంటనే పట్టాలెక్కించేందుకు గాను బన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ మరియు మురుగదాస్ ల కాంబోలో కూడా సినిమాలను అల్లు అర్జున్‌ చేయాల్సి ఉంది. కనుక కొరటాల శివ టర్న్‌ వచ్చేప్పటికి చాలా కాలం అయ్యే అవకాశం ఉందని.. అందుకే బన్నీ కోసం అనుకున్న కథను విజయ్‌ దేవరకొండతో చేయాలని కొరటాల భావిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్‌ డేట్లు ఇస్తే చేసేందుకు కొరటాల వద్ద మరో సినిమా కథ కూడా ఉందని టాలీవుడ్‌ వర్గాల టాక్.

ప్రస్తుతం లైగర్‌ సినిమాను చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను శివ నిర్వాన దర్శకత్వంలో ఒక సినిమాను చేయాల్సి ఉంది. ఆ రెండు సినిమాలను కూడా వచ్చే ఏడాదిలో విజయ్‌ ముగించే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆచార్యను ముగించి వెంటనే ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమాను చేయబోతున్నాడు. కొరటాల శివ వచ్చే ఏడాది చివరి వరకు విజయ్‌ దేవరకొండ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

విజయ్‌ దేవరకొండను పవర్‌ ఫుల్‌ యంగ్‌ పొలిటీషియన్ గా లేదంటే స్టూడెండ్‌ లీడర్‌ గా అభిమానులు చూడాలని ఆశ పడుతున్నారు. ఆ కోరికను కొరటాల శివ తీర్చబోతున్నాడు. 2023 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ విషయమై కొరటాల నుండి స్పష్టత వస్తుందేమో చూడాలి.  అల్లు అర్జున్‌ కు చెప్పిన కథను విజయ్ దేవరకొండ చేస్తే అప్పటికి అభిమానుల నుండి రియాక్షన్‌ ఎలా ఉంటుంది అనే విషయమై కూడా చర్చ జరుగుతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మరియు ముందు ముందు చేయబోతున్న సినిమాలు ఆయన్ను మరింతగా స్టార్ గా నిలపడం ఖాయం అన్నట్లుగా అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కొరటాల శివతో సినిమా అంటే ఇక ఆయన రేంజ్ స్టార్ హీరోల సరసన చేరడం ఖాయం.
Tags:    

Similar News