బాలీవుడ్ టాప్ స్టార్లు స్పోర్ట్స్ స్టార్ల‌నే కిందికి దించిన రౌడీ గారు!

Update: 2021-06-04 12:30 GMT
టాలీవుడ్ లో రౌడీ బోయ్ గా పాపుల‌రైన విజ‌య్ దేవ‌ర‌కొండ పాపులారిటీ స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా ఎదుగుతోంది. టాలీవుడ్  టాప్ హీరోలంద‌రినీ కిందికి నెట్టి టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ (కావాల్సిన‌వాడు) హీరోగా నంబ‌ర్ 1 స్థానంలో నిలిచాడు.

ఇక జాతీయ స్థాయిలో చూస్తే బాలీవుడ్ లో టాప్ స్టార్లంద‌రినీ కిందికి దించాడు. స్పోర్ట్స్ లో పాపుల‌ర్ ప‌ర్స‌నాలిటీలు అత‌డి కంటే గ్రాఫ్ లో కింద‌నే ఉన్నారు. ర‌ణ్ వీర్ సింగ్- ర‌ణ‌బీర్ - కార్తీక్ ఆర్య‌న్ - విక్కీ కౌశ‌ల్ - విరాట్ కోహ్లీ- కె.ఎల్ రాహుల్ ఇలా గొప్ప ఫాలోయింగ్ ఉన్న వాళ్లంతా రౌడీ క్రేజు ముందు త‌లొంచాల్సొచ్చింది.

అంత‌గా స్టైల్ ఐక‌న్ గా యువ‌త‌రం మెచ్చేవాడిగా ఎదిగాడు. కేవ‌లం తెలుగు రాష్ట్రాల వ‌ర‌కే అత‌డి ప్ర‌భావం ఉందేమో అనుకుంటే అటు నార్త్ లోనూ గొప్ప ఫాలోయింగ్ ని సంపాదించుకుని జ‌నాల ఎంపిక‌తో అత‌డు ఆ స్థాయిని సాధించాడు. త‌న‌దైన వైబ్రేంట్ లుక్ స్టైలిష్ అప్పియ‌రెన్స్ టాకేటివ్ నేచుర్ తో ఈ స్థాయిని అందుకున్నాడు.  టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50 లో నేషనల్ వైడ్ గా రెండో స్థానం దక్కించుకున్నారు. గ‌తేడాది మూడో  స్థానంలో నిల‌వ‌గా ఈసారి ఒక స్థానం మెరుగుప‌రుచుకున్నాడు.

లైగ‌ర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేస్తున్నాడు. ఈ సినిమా ఘ‌న‌విజ‌యం సాధిస్తే విజ‌య్ బాలీవుడ్ స్టార్ల‌తో పోటీప‌డుతూ పాన్ ఇండియా సినిమాల‌తో స‌త్తా చాటే వీలుంటుంది. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత విజ‌య్ ని అక్క‌డా పెద్ద స్టార్ ని చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న సంగ‌తి తెలిసిన‌దే.
Tags:    

Similar News