వైరల్: కేసీఆర్ కు వర్మ 'విస్కీ' చాలెంజ్
లాక్ డౌన్ వేళ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. సామాన్య, మధ్యతరగతి నుంచి సెలెబ్రెటీల వరకు అందరూ కరోనా కారణంగా ఇంటి నుంచి బయట అడుగు పెట్టడంలేదు. ఇంటిపనులు చేస్తూ కాలం గడిపేస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ లో ‘బి ద రియల్ మ్యాన్’ చాలెంజ్ మొదలైంది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి ఇంట్లో పనులు చేస్తూ రాజమౌళికి ఈ చాలెంజ్ విసరడం.. రాజమౌళి తాజాగా ఇంటి పనులు చేసి ఎన్టీఆర్ కు విసరడం.. ఆయన చేసి వీడియో పెట్టడంతో ఇదో చాలెంజ్ గా టాలీవుడ్ లో వైరల్ గా మారిపోయింది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రముఖ చానెల్ చేసిన ఇంటర్వ్యూలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను ఏదైనా చాలెంజ్ విసరాలని యాంకర్ ప్రశ్నించాడు. దానికి వర్మ యాంకర్ దిమ్మదిరిగే చాలెంజ్ విసిరాడు..
మందులేక అందరూ లాక్ డౌన్ లో కొట్టుకుంటున్నారని.. ఈసారి ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఒక గ్లాస్ విస్కీ తాగాలని చాలెంజ్ విసిరాడు. మందు లేక అల్లాడుతున్న వారంతా కేసీఆర్ విలన్ లా మందుతాగుతుంటే గింజుకోవాలని.. వారి ఎక్స్ ప్రెషన్స్ ను తాను వెబ్ సిరీస్ గా రిలీజ్ చేస్తానని వర్మ తెలిపాడు.
ఇలా సీఎం కేసీఆర్ కే విస్కీ చాలెంజ్ విసిరి వర్మ సదురు టీవీ చానెల్ ను, యాంకర్ ను ఇరకాటంలో పడేశారు. ఎరక్కపోయి వర్మ ఇరుకున్నాడా? లేక చానెల్ ఇరుక్కుందా తెలియకుండా పోయింది.
కాగా కరోనా కట్టడికి అంత కృషి చేస్తున్న కేసీఆర్ కు విస్కీ చాలెంజ్ విసురుతావా అని వర్మపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Full View