చట్టం చేయాల్సిందే అంటున్న రేణు

Update: 2018-04-18 08:02 GMT
మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణూ దేశాయ్ స్పందించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. సామాజిక అంశాలపై తరచుగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంది. కానీ రీసెంట్ గా బయటకు వస్తున్న అఘాయిత్యాలపై మాత్రం సుదీర్ఘమైన పోస్ట్ చేసింది రేణు.

'ఆసిఫా.. నిర్భయా.. ఉన్నావో.. ఇక్కడ పేర్లు వేరయినా.. సంఘటనలు వేరయినా.. ఉమ్మడి అంశం ఒక్కటే.. అందరూ మహిళలే. విభిన్న వయసులు.. విభిన్న మతాలు.. విభిన్న నేపథ్యాల వారు. వారు చేసిన నేరం ఏంటంటే మహిళలు కావడమే.. పలు రోజులుగా నేను లాయర్లతోను.. సీనియర్ సామాజిక వేత్తతోను.. ఓ పోలీస్ ఆఫీసర్ తో కూడా మాట్లాడాను. వీరంతా చెప్పిన విషయం ఒక్కటే. సోషల్ మీడియాలో ఎంతటి హంగామా చేసినా.. రోడ్లకు ఎక్కి నినాదాలు చేసినా ఉపయోగం ఏమీ ఉండదనే అంటున్నారు. రేపిస్టుల గుండెలలో దడ పుట్టించేంతటి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చే వరకూ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి వేమీ ఆగవు' అంటోంది రేణూ దేశాయ్.

ప్రతీ కొన్ని నెలలకు ఓసారి ఇలాంటివి బయటకు వస్తూనే ఉన్నాయని.. కానీ అటు మనుషులు కానీ.. ఇటు చట్టాలను చేసేవారు కానీ మారడం లేదని అంటోంది రేణూదేశాయ్. మన కుటుంబంలో మహిళలను మనమే భద్రంగా ఉంచుకోవడమే ప్రస్తుత పరిస్థితికి పరిష్కారంగా అనిపిస్తోందంటూ చెప్పుకొచ్చింది రేణు.
Tags:    

Similar News