మరోసారి రేణు దేశాయ్ కెమెరా ముందుకు!

Update: 2018-12-27 11:32 GMT
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన సినిమాలు తక్కువే అయినా ప్రేక్షకుల్లో ఆమెకు గుర్తింపు ఎక్కువే. పవన్ కళ్యాణ్ తో వివాహం తర్వాత సినిమాల్లో నటించడం పూర్తిగా మానేసిన రేణు మళ్ళీ ఇప్పటివరకూ తెరముందుకు రాలేదు.  2003 లో నటించిన 'జానీ' రేణు దేశాయ్ లాస్ట్ సినిమా.  మధ్యలోఒకసారి టీవీ షో కోసం జడ్జి అవతారం ఎత్తినా అది ఎక్కువ కాలం సాగలేదు. ఇప్పుడు మరోసారి కెమెరా ముందుకు రానుంది.

కానీ ఈసారి రేణు దేశాయ్ బ్రాండ్ అంబాజిడర్ అవతారం ఎత్తుతోంది.  కళామందిర్ కళ్యాణ్ ఈమధ్యే రేణు దేశాయ్ తో ఒక బ్రాండ్ ఎండార్స్ మెంట్ డీల్ కుదుర్చుకున్నాడట.  ఈ డీల్ లో భాగంగా 'కాంచీపురం వరమహలక్ష్మి సిల్క్స్' బ్రాండ్ ను రేణు దేశాయ్ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది.  ఈ బ్రాండ్ కు సంబంధించిన యాడ్ ఫిలిం షూట్ రీసెంట్ గా చెన్నైలో జరిపారని సమాచారం.  ఈ యాడ్ షూటింగ్ నుండి ఒక ఫోటో ఇప్పటికే లీక్ అయ్యి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

ఈ యాడ్ కనుక క్లిక్ అయితే రేణు దేశాయ్ ఖాతాలోకి మరికొన్ని ఇతర యాడ్స్ రావడం ఖాయమే. పిల్లలు అకీరా.. ఆద్య కొంచెం పెద్దయ్యారు కాబట్టి నెమ్మదిగా రేణు మళ్ళీ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ టేకప్ చేస్తున్నట్టుగా ఉంది.  మరి యాడ్స్ మాత్రమేనా లేదా సినిమాల్లోకి నటిగా మళ్ళీ రీ-ఎంట్రీ ఇస్తుందా అనేది వేచి చూడాలి. 
Tags:    

Similar News