ప‌వ‌న్ తో విడాకుల రీజ‌న్ చెబుతుంద‌ట కానీ..

Update: 2017-11-11 08:08 GMT
రేణుదేశాయ్ అంటే అదో క్రేజ్‌. ప‌వ‌ర్ స్టార్ మాజీ స‌తీమ‌ణి అయిన‌ప్ప‌టికీ.. త‌మ అన్న‌కు వ‌దిగా ఫిక్స్ అయిన ప‌వ‌న్ అభిమానులు రేణు నుంచి ఏదో ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. ఎప్పుడైతే పెళ్లి బంధం విడాకుల‌తో తెగిందో.. అక్క‌డితో త‌మ అభిమాన న‌టుడి ఎక్స్ వైఫ్ అయ్యింద‌న్న వాస్త‌వాన్ని ఒప్పుకోవ‌టానికి ప‌వ‌ర్ ఫ్యాన్స్ స‌సేమిరా అంటుంటారు.

విడాకులు తీసుకున్న ప‌వ‌న్‌.. ఆ త‌ర్వాత ర‌ష్యా మ‌హిళ‌ను పెళ్లి చేసుకోవ‌టం.. ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌న‌టం జ‌రిగిపోయాయి. మ‌రోవైపు రేణుదేశాయ్ మాత్రం ఒంట‌రిగా జీవిస్తోంది.ఇవాల్టి రోజుల్లో ఒక మ‌హిళ ఒంట‌రిగా ఉండ‌టం ఎంత క‌ష్టం. అయిన‌ప్ప‌టికీ రేణు రెండో పెళ్లి గురించి కొన్ని నెల‌ల క్రితం వ‌ర‌కూ ఆస‌క్తి వ్య‌క్తం చేయ‌లేదు.

ఈ మ‌ధ్య‌న తాను తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌టం.. ఆ స‌మ‌యంలో ఇంట్లో ఎవ‌రైనా తోడు ఉంటే త‌న‌కు.. త‌న కుటుంబానికి ఎంతో అండగా ఉంటుంద‌న్న విష‌యాన్ని గుర్తించిన ఆమె.. త‌న పెళ్లి ముచ్చ‌ట‌ను సోష‌ల్ మీడియాలో చెప్పేసింది. దీనిపై జ‌రిగిన ర‌చ్చ అంద‌రికి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్ కు రేణు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. సంచ‌లనాల‌కు కేరాఫ్  అడ్ర‌స్ అయిన స‌ద‌రు ఛాన‌ల్ ఎండీ తానే స్వ‌యంగా ఇంట‌ర్వ్యూ చేసే ప్రోగ్రామ్‌కి ఉండే ఆద‌ర‌ణ అంద‌రికి తెలిసిందే.  తాను ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తిని ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు వేయ‌టం.. సూటిగా.. లోతైన ప్ర‌శ్న‌ల‌తో హాట్ టాపిక్ స‌మాధానాలు వ‌చ్చేలా చేసే ఆయ‌న తీరుకు త‌గ్గ‌ట్లే కొన్ని అంశాలకు సంబంధించి రేణు ఆస‌క్తిక‌ర అంశాల్ని చెప్పిన‌ట్లు క‌నిపిస్తోంది. ఆదివారం టెలికాస్ట్ అయ్యే ఈ ఇంట‌ర్వ్యూకు సంబంధించిన టీజ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

త‌న పెళ్లి గురించి.. త‌న విడాకుల గురించి కొంచెం చెప్పిచెప్ప‌నట్లుగా చెప్పిన రేణుదేశాయ్‌.. ప‌వ‌న్ తో విడాకుల‌కు కార‌ణం గురించి అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. ఏడేళ్ల త‌ర్వాత ఇప్పుడు కార‌ణం చెప్పి కొత్త త‌ల‌నొప్పులు తెచ్చుకోవ‌టం ఎందుకని తాను అనుంటున్నాన‌ని.. అందుకే మౌనంగా ఉన్న‌ట్లు ఆమె చెప్పారు. అంతేకాదు.. తాను విడాకుల కార‌ణాన్ని చెబుతాన‌ని.. కాకుంటే ముస‌లి అయిపోయాక త‌న ఆత్మ‌క‌థ‌లో చెబుతాన‌ని చెప్పారు.

విడాకుల‌ప్పుడు భారీగా డ‌బ్బులు ఇచ్చిన‌ట్లుగా జ‌రుగుతున్న ప్ర‌చారం మీద ప్ర‌శ్న వేసిన‌ప్పుడు.. మీరు కూడా దాన్ని న‌మ్ముతున్నారా? అంటూ రేణు ఆశ్చ‌ర్యంగా అడ‌గ‌టం క‌నిపించింది. త‌న‌ను పెళ్లి చేసుకోవ‌టానికి ఎవ‌రూ రావ‌టం లేద‌ని.. తాను మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌క‌టించిన వెంట‌నే.. తాను పెళ్లి చేసుకునే వ్య‌క్తిని ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తామంటూ ఒక వ్య‌క్తి పోస్ట్ పెట్టాడ‌ని చెప్పారు రేణు. పెళ్లి కాకుండానే చ‌చ్చిపోతానేమోన‌ని త‌న‌కు అనిపిస్తోందంటూ మాట్లాడిన రేణు ఇంట‌ర్వ్యూ ఫుల్ లెంగ్త్ కానీ బ‌య‌ట‌కు వ‌స్తే మ‌రిన్ని ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నోరు తెరిచి పెళ్లికి రెఢీ అన్న త‌ర్వాత కూడా రేణుకు ఆఫ‌ర్లు రాక‌పోవ‌టం ఆశ్చ‌ర్య‌మే క‌దూ?

Full View
Tags:    

Similar News